Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

వనపర్తి జిల్లా హాకీ క్రీడకు పుట్టినిల్లు

padmarao-goud-image

వనపర్తి జిల్లాను క్రీడాహబ్‌గా తీర్చిదిద్దుతాం
రూ.2 కోట్ల 40లక్షల నిధుల వ్యయంతో నిర్మించిన తెలంగాణ హాకీ అకాడమి
రూ.2 కోట్ల 65 లక్షల నిధులతో గ్రీన్‌ఫీల్డ్ అవుట్ డోర్, ఇండోర్ స్టేడియం
జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయాన్ని ప్రారంభించిన రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, యువ జన సర్వీసుల శాఖ మంత్రి టి.పద్మారావు గౌడ్

మన తెలంగా ణ/వనపర్తి : వనపర్తి జిల్లా హాకీ క్రీడకు ఆణిముత్యమని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, యువ జన సర్వీసుల శాఖ మంత్రి టి. పద్మారావు గౌడ్ అన్నారు. శుక్రవారం వనపర్తి జిల్లా కేంద్రంలో రూ.2కోట్ల 40 లక్షల నిధుల వ్యయంతో నిర్మించి న తెలంగాణ హాకీ అకాడమీని ప్రారంభించారు. అంతేకాక రూ.2 కోట్ల 65 లక్షల నిధుల వ్యయంతో నిర్మించిన గ్రీన్‌ఫీల్డ్ అవుట్ డోర్ స్టేడియంను, ఇండోర్ స్టేడియంను, అలాగే జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయంను ప్రారంభించారు. ఈ సందర్భం గా హాకీ అకాడమి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి పద్మారావుగౌడ్ మాట్లాడుతూ వనపర్తి హాకీ అకాడమిలో శిక్షణ పొందిన క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని ఆకాంక్షిం చారు. వనపర్తి జిల్లాకు క్రీడలకు ప్రత్యేకించి హాకి క్రీడకు పెట్టింది పేరని,అందువల్లనే జిల్లాలో హాకి అకాడమి నెలకొల్పినట్లు తెలిపారు. అలాగే రూ. కోటి నిధుల వ్యయంతో ఇండోర్ స్టేడియం. జిల్లా కేంద్రంలో నిర్మించడం సంతోషకరమన్నారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు, క్రీడాకారులకు పెద్ద ఎత్తున ప్రాధాన్యత నిస్తుందని , ఇందులో భాగంగానే మండల స్థాయి మొదలుకొని జాతీయ స్థాయి వరకు వివిధ క్రీడల్లో ప్రతిభ కనబర్చిన వారికి రూ.10 లక్షల నుండి రూ. 50 లక్షల వరకు రివార్డులు ఇస్తున్నట్లు తెలిపారు. క్రీడాకారులు ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని సద్వినియోగం చేసుకొని గొప్ప క్రీడాకారులు గా రాణించాలని ,ఎదగాలని కోరారు . అంతకు ముందు మంత్రి ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా గౌడ,గీత కార్మికులతో మాట్లాడుతూ గీత కార్మికుల హక్కులను కాపాడడంతో పాటు వారి సం క్షేమం కోసం కృషి చేయడం ప్రభుత్వ బాధ్యత అని అన్నారు. ప్రభు త్వం గీతకార్మికులకు అండగా ఉంటుందన్నారు. ప్రభుత్వం రెంటల్స్‌ను తొలగించడంతో పాటు ,పాత బకాయిలను మాఫి చేసిందని, ఎలాంటి ఖర్చు లేకుండా గీతా కార్మికులు కల్లుగీసి అమ్ముకొనే అవకాశం కల్పించిందన్నారు. హైద్రాబాద్‌లో గీత భవన్ కోసంప్రభుత్వం ఐదు ఎకరాల స్థలాన్ని రూ. 5 కోట్ల నిధులను కెటాయించిందని అవసరమైతే మరిన్ని నిధులు ఇప్పిస్తామని ప్రకటించారు.ఈ సందర్భంగా గీత కార్మికులు మంత్రిని ఘనంగా సన్మానించారు.

వనపర్తి జిల్లాను హాకీ హబ్‌గా తీర్చిదిద్దుతాం : రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
వనపర్తి జిల్లాను హాకీ హబ్‌గా తీర్చిదిద్దుతామని, హాకి హబ్‌గా మార్చాలన్నదే తమ ధ్యేయమని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. ఈసందర్భంగా నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ వనపర్తి జిల్లా క్రీడలకు క్రీడాకారులకు ప్రసిద్ధిగాంచిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులకు తగిన ప్రోత్సాహం ఇస్తుందని వాలీబాల్, హాకీ, ఫుట్‌బాల్ క్రీడలకు జాతీయ స్థాయిలో నాయకత్వం వహిస్తున్న యశ్వంత్‌కుమార్, అలాగే షెపక్ తక్రాలో రాణిస్తున్న నవత, కిక్‌బాక్సింగ్‌లో ప్రతిభ కనబరుస్తున్న భరత్‌కుమార్‌లకు రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రోత్సాహకాలు అందించామని తెలిపారు. రాబో యే కాలంలో ప్రతి మండల కేంద్రంలో క్రీడా ప్రాంగణాలు ఉండాలన్నారు. ప్రభుత్వం గురుకుల పాఠశాలలు, కళాశాలలు, విద్యాలయా ల ద్వారా నాణ్యమైన విద్య నందిస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఈ తరం విద్యార్థులు క్రీడాకారులుగా రాణిస్తున్నారన్నారు. రాబోయే తరంలో కూడా వనపర్తి జిల్లాకు మంచి పేరు సంపాదించాలన్నదే తమ ధ్యేయమన్నారు.

ఎంఎల్‌ఎ డా.జి.చిన్నారెడ్డి మాట్లాడుతూ..
వనపర్తి జిల్లా విద్యతో పాటు క్రీడలకు ప్రసిద్ది గాంచిందని ముఖ్యంగా హాకి, ఫుట్‌బాల్ క్రీడలకుప్రసిద్ది అన్నారు. వనపర్తి హాకి అకాడమి నుండి ధ్యాన్‌చంద్ లాంటి వారు తయారు కావాలన్నారు. ప్రస్తుతం ఉన్న రెండు హాకీ ఫీల్డుల్లో ఒక దానిని టర్ఫ్ మైదానంగా మార్చాలని ,ప్రస్తుతం ఉన్న స్టేడియం మైదానంలో స్విమ్మింగ్ ఫూల్‌ను ఏర్పాటు చేయాలని ,పెబ్బేరులో ఫుట్‌బాల్ అకాడమి ఏర్పాటు చేయాలని మంత్రికి విన్నవించారు.

రాష్ట్ర క్రీడల అభివృద్ధి సంస్థ చైర్మన్ వెంకటేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ….
వనపర్తి జిల్లాను క్రీడల హబ్‌గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామనిఅన్నారు. జిల్లాలో హాకీకి మరింత ప్రసిద్ది తీసుకురావాలని క్రీడాకారులకు పిలుపునిచ్చారు. రాష్ట్ర క్రీడల అథారిటి ఎండి. దినకర్ బాబు మాట్లాడుతూ రాష్ట్రంలో క్రీడల పాలసి దిన దిన ప్రవర్థమానం కావాలన్నారు. వనపర్తి జిల్లానుక్రీడారంగంలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావాలని, వనపర్తిపట్టణం విద్యతో పాటు క్రీడల్లో రాణించాలని హాకి క్రీడలు, హాకి అకాడమి మొదటి బ్యాచ్‌లోఉన్న 24 మంది క్రీడాకారులు వనపర్తికి అవార్డులు తీసుకురావాలని కోరారు.రూ. 2 కోట్ల 40 లక్షల నిధులతో హాకి అకాడమి, గ్రీన్‌ఫీల్డ్ అవుట్‌డోర్ స్టేడియం, ఇండోర్ స్టేడియం రావడం హర్షనీయమ న్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రమేష్‌గౌడ్,క్రీడల అభివృద్ధి అధికారి కళ్యాణ్‌గౌడ్‌లు మాట్లా డారు. అనంతరం హాకీ క్రీడాకారులు నారాయణదాస్‌ను శాలువాతో ఘనంగా సన్మానించారు.కార్యక్రమం లో జాయింట్ కలెక్టర్ పి.చంద్రయ్య,ఆర్‌డిఒ చంద్రారెడ్డి, కౌన్సిలర్లు జ్యోతి, శ్రీధర్,లోక్‌నాథ్‌రెడ్డి, టిఆర్‌ఎస్ పట్టణాధ్యక్షులు గట్టుయాదవ్, డిసిసి అధ్యక్షులు శంకర్‌ప్రసాద్,మార్కెట్‌యార్డు చైర్మన్ రవికుమార్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ విజయ్‌భాస్కర్ తదితరులున్నారు.

Comments

comments