Home వార్తలు రాజమౌళి, మణిరత్నం సినిమాల్లో చేయాలనుంది

రాజమౌళి, మణిరత్నం సినిమాల్లో చేయాలనుంది

cinema1

వివి వినాయక్ దర్శకత్వంలో అక్కినేని అఖిల్, సయేషా హీరోహీరోయిన్లుగా పరిచయమవుతున్న చిత్రం ‘అఖిల్’. ఈ చిత్రం దీపావళి కానుకగా బుధవారం విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా అందాలతార సయేషాతో ఇంటర్వూ విశేషాలు…

‘అఖిల్’ సినిమా ఎలా ఉంటుంది?
అన్ని కమర్షియల్ అంశాలు కలగలిసిన ప్యాకేజ్డ్ ఫిల్మ్ ‘అఖిల్’. రొమాన్స్, సాంగ్స్, ఫైట్స్ అన్నీ ఉంటాయి. సినిమాలో ప్రతీది కథకు లింక్ అయి ఉంటుం ది. కామెడీ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తుంది. ఈ సినిమాలో దివ్య అనే ఒక స్వీట్‌గర్ల్ పాత్రలో నటించాను. తను అమాయకపు అమ్మాయి.
తెలుగు సినిమా ద్వారా సినీ రంగంలోకి వస్తుండడం ఎలా ఉంది?
నిజానికి నా మొదటి సినిమా హిందీలో చేయాల్సింది కానీ ఆ ప్రాజెక్ట్ ఆలస్య మవుతూ వచ్చింది. దీంతో తెలుగులో చేసిన ‘అఖిల్’తో సినీ రంగ ప్రవేశం చేస్తు న్నాను. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. తెలుగు ఇం డస్ట్రీ చాలా గొప్పది. టాలీవుడ్ ద్వారా పరిచయమవ్వడం చాలా సంతోషంగా ఉంది.
అఖిల్‌తో కలిసి పనిచేయడం ఎలా అనిపించింది?
అఖిల్ సపోర్టివ్ కో యాక్టర్. అతను బాగా హార్డ్‌వర్క్ చేస్తాడు. తనలో ఆత్మవి శ్వాసం ఎక్కువ. అఖిల్ మంచి డాన్సర్. బాగా పర్‌ఫార్మ్ చేస్తాడు. అతనితో పనిచేయడం మరచిపోలేని అనుభవాన్నిచ్చింది.
నటన, డాన్సులో ఏమైనా శిక్షణ తీసుకున్నారా?
ప్రత్యేకంగా ఏ యాక్టింగ్ ఇనిస్టిట్యూట్‌కు వెళ్లలేదు. ఇంట్లోనే ఒకరు నాకు యాక్టింగ్‌లో శిక్షణనిచ్చేవారు. చిన్నప్పుడు డాన్సుల్లో శిక్షణ తీసుకున్నాను. కథక్, ఒడిసి వంటి క్లాసిక్ డాన్సులే కాదు మోడర్న్ డాన్సులు కూడా నేర్చుకు న్నాను. నాకు డాన్స్ చేయడమంటే చాలా ఇష్టం. భవిష్యత్తులో డాన్స్‌కు ప్రాము ఖ్యతనిచ్చే పాత్రల్లో నటించాలనుంది. ‘అఖిల్’ సినిమాలో రెండు సాంగ్స్‌లో బాగా డాన్సు చేసే ఛాన్స్ దొరికింది.
సినిమా విషయంలో ఎవరైనా మంచి సలహాలిచ్చారా?
దర్శకుడు వినాయక్ మంచి ప్యాషన్ ఉన్న డైరెక్టర్. ఆయన నాతో… ‘నువ్వు కంఫర్ట్‌గా ఉంటేనే ఏదైనా చేయ గలవు… కాబట్టి ముందు నీ కంఫర్ట్ చూస్కో… తర్వాతే ఏదైనా’ అని చెప్పారు. ఆయన చెప్పిన దాన్ని ఫాలో అయి సినిమాలో చక్కగా నటిం చగలను. వినా యక్‌తో మరిన్ని మంచి సినిమాలు చేయాలనుంది.
ఎలాంటి చిత్రాల్లో నటించాలనుంది?
డిఫరెంట్ రోల్స్, పెద్ద డైరెక్టర్స్, మంచి స్క్రిప్ట్ ఉన్న సినిమాల్లో నటిస్తాను. నేను పనిచేయాలనుకుంటున్న డైరెక్ట ర్స్ లిస్టు ఉంది. రాజమౌళి, మణిర త్నం లాంటి దర్శకుల చిత్రాల్లో నటించాలనుంది.
తెలుగులో ఏమైనా సినిమాలు చూశారా?
ఈ సినిమాలో నటించకముందు వర కు నాకు తెలుగు ఇండస్ట్రీ గురించి పెద్దగా తెలియదు. హిందీలో డబ్ అయిన కొన్ని సినిమాలు మాత్రమే చూశాను. తాజా గా శ్రీమంతుడు, బాహుబలి సినిమాలు చూశాను. మహేష్‌బాబు, అల్లుఅర్జున్, రామ్‌చరణ్‌లాంటి టాలెంటెడ్ హీరోలతో కలిసి పనిచేయాలనుంది. ఇక గ్లామ రస్ పాత్రల్లో నటించి ప్రేక్షకులను మెప్పిస్తాను.
నెక్స్ ప్రాజెక్ట్?
కొన్ని ప్రాజెక్టులు చర్చల్లో ఉన్నాయి. హిందీలో అజయ్‌దేవ్‌గణ్‌తో ‘శివాయ్’ అనే సినిమాలో నటిస్తున్నాను. ఈనెల 6 నుంచి షూటింగ్ మొదలైంది.