Home వరంగల్ ‘ఈదుల్ ఫితర్’కు ఓరుగల్లు సిద్ధం

‘ఈదుల్ ఫితర్’కు ఓరుగల్లు సిద్ధం

 Warangal City decorate For ramadan festival

మన తెలంగాణ/ వరంగల్ అర్బన్ జిల్లా ప్రతినిధి : ముస్లింలు పవిత్ర పండుగైన రంజాన్ వేడుకలకు ఓరుగల్లు నగరం సిద్ధమైంది. నెలరోజుల పాటు కఠోర దీక్షతో ముస్లింలు ఉపవాసాలు, పవిత్ర ప్రార్థనలు ముగించుకొని నేడు రంజాన్‌ను జరుపుకుంటారు. శాంతి, సౌభ్రాతృత్వానికి ప్రతీకగా భావించే రంజాన్ పండుగ అసలు పేరు “ ఈదుల్ ఫితర్‌”. ప్రేమ, మానవత్వాల సమ్మేళనంతో ఈద్ ముబారక్ భాయి బాయి అంటూ కుల, మతాలకతీలతంగా రంజాన్  పండుగ వేడుకలలో ప్రజలు పాల్గొంటారు. ముస్లీం సోదరులు ఐక్యతకు మారుపేరుగా రంజాన్ వేళల్లో అన్ని మతాలను గౌరవిస్తూ రంజాన్‌ను జరుపుకుంటారు. అందరితో కలవిడిగా కలిసిపోయి ఆలింగనాలు, పండ్లు, స్వీట్లు, తతిరత తినుబండారలతో పండుగ జరుపుకుంటారు. ఇలాంటి పవిత్రమైన రంజాన్ పండుగ వేడుకలకు ఓరుగల్లు ముస్తాబయింది. నగర వీధులన్నీ జనంతో కిటకిటలాడుతున్నాయి. నగరంలోని మసీదులనీ కాంతులను వెదజల్లే వెలుతురులను తలపించే విధంగా అలంకరించబడ్డాయి. అలీం, హరీస్, దుకాణాలు నగర వీధులలో వెలిశాయి. ప్రధాన కూడళ్లు జనంతో కిక్కిరిపోయాయి. అయితే ముస్లీం సోదరుల పవిత్ర పండుగైన రంజాన్ సందర్భంగా అధికార ప్రతిపక్షాలు పలు కార్యక్రమాలు చేపట్టారు. ముస్లీం సోదరీమనులకు పలు పార్టీలు చీరలు పంపిణీ, పలు చోట్ల బియ్యం, పండ్లు పంపిణీ కార్యక్రమాలను నిర్వహించారు. అధికార, ప్రతిపక్షాలు ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేశారు. కుల,మతాలకు అతీతంగా ఇఫ్తార్ వింధులు పలు చోట్ల నిర్వహించి ఐక్యతను చాటారు. రాష్ట్ర ఉపముఖ్యమంత్రితో సహా అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఇఫ్తార్ విందులు, పలు కార్యక్రమాలలో పాల్గొన్నారు. ప్రతిపక్ష పార్టీకి చెందిన కాంగ్రెస్ నేత భట్టివిక్రమార్క తదితరులు వరంగల్ జిల్లా కేంద్రంగా ఇఫ్తార్ విందుల్లో పాల్గొన్నారు. నేడు జరుగే రంజాన్ పండుగకు ఓరుగల్లులోని మసీదులన్నీ ముస్తాబయ్యాయి. పలు చోట్ల అధికార ప్రతిపక్ష పార్టీ నేతలు పాల్గొననున్నారు. కుల, మతాలకతీతంగా నగర వీధులన్ని జనంతో నిండిపోనున్నాయి. వరంగల్ మండిబజార్ ఏరియా, ఖాజీపేట, హన్మకొండ తదితర ప్రధాన కేంద్రాలలోని ముఖ్యమైన మసీదులు రంజాన్ వేడుకలకు సిద్దమయ్యాయి. పోలీసులు తగు జాగ్రత్తలు తీసుకుంటూ వారివారి విధులను నిర్వర్తించడంలో నిమగ్నమయ్యారు.