Search
Friday 21 September 2018
  • :
  • :
Latest News

కలెక్టరేట్ వద్ద వాచ్‌మెన్ ఆత్మహత్యాయత్నం…

Watchmen commit suicide at the Collectorate
మేడ్చల్: గత తొమ్మిది నెలలుగా జీతం చెల్లించక పోవడంతో పౌర సరఫరాల శాఖ గోదాం వాచ్‌మెన్ కలెక్టరేట్ వద్ద ఆత్మహత్యాయత్నాకి పాల్పడ్డిన సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే… కీసరకు చెందిన జూపల్లి నాగేష్ (36) స్థానికంగా ఉన్న మార్కెటింగ్ సోసైటీ గోదాం ఆవరణలో పౌర సరఫరాల శాఖ ఎంఎల్‌ఎస్ పాయింట్ (ఘట్‌కేసర్, కాప్రా) గోదాంలో గత కొంత కాలంగా వాచ్‌మెన్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. గడిచిన తొమ్మిది నెలలుగా జీతం చెల్లించకపోవడంతో పలుసార్లు అధికారులకు మొర పెట్టుకున్నాడు. ఈ విషయంలో పౌర సరఫరాల శాఖ ఎంఎల్‌ఎస్ పాయింట్ మేనేజర్‌లు నాగేష్ జీతం చెల్లింపుల విషయంపై ఉన్నతాధికారులకు లేఖ సైతం రాశారు. కాగా.. శుక్రవారం జిల్లా కలెక్టరేట్‌లోని పౌర సరఫరాల శాఖ అధికారులను కలిసిన నాగేష్ తొమ్మిది నెలల జీతం చెల్లించాలని మొర పెట్టుకున్నప్పట్టికి అధికారుల నుంచి స్పంధన కొరవడటంతో అర గంట పాటు కలెక్టరేట్ మొదటి అంతస్తులోని కలెక్టర్ చాంబర్ వద్ద తచ్చాడిన అతను కిందకు నడుచుకుంటూ వచ్చి కలెక్టరేట్ ప్రధాన ద్వారం వద్ద ఒక్క సారిగి నేలపై పడి అపస్మరక స్థితిలోకి వెళ్లాడు. గమనించిన కలెక్టరేట్ సిబ్బంది నాగేష్ విషం తాగినట్లు గుర్తించి చికిత్స నిమిత్తం 108 వాహనంలో ఘట్‌కేసర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నాగేష్ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు అక్కడి వైద్యులు తెలిపారు. ఈ విషయంపై పౌర సరఫరాల శాఖ అధికారులను ప్రశ్నించగా నాగేష్‌ను గోదాం వద్ద వాచ్‌మెన్‌గా ఎవరు నియమించారు, ఎవరి అనుమతితో విధులు నిర్వహిస్తున్నాడనే విషయంలో స్పష్టత లేదని అన్నారు. జీతం చెల్లించే అధికారం తమకు లేదు, పని మానాలని పలు సార్లు నాగేష్‌కు వివరించిన అలాగే కొనసాగుతున్నాడని చెప్పారు. వాచ్‌మెన్‌గా పనిచేస్తున్న నాగేష్‌కు తమ శాఖతో సంబంధం లేదని జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారులు చెబుతుండగా, నాగేష్‌కు తొమ్మిది నెలల జీతం చెల్లించాలని పౌర సరఫరా శాఖ ఎంఎల్‌ఎస్ పాయింట్ మేనేజర్‌లు తమపై అధికారులకు లేఖలు రాయడం విశేషం.

Comments

comments