Search
Monday 23 July 2018
  • :
  • :

వాచ్‌మన్ అనుమానాస్పద మృతి!

Watchmen Suspicious Death in Rangareddy District

రంగారెడ్డి: అనుమానాస్పద స్థితిలో వాచ్‌మన్ మృతి చెందిన సంఘటన రంగారెడ్డి జిల్లాలోని మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని బుద్వేల్ పాత బస్సుల గోడౌన్‌లో చోటు చేసుకుంది. శంషాబాద్ మండలం గండిగూడకు చెందిన యాదయ్య(55) అనే వ్యక్తి బుద్వేల్ పరిధిలో గల ప్రొ. జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం గేట్ ఎదురుగా ఉన్న ఇడ్లి హోటల్‌లో వాచ్‌మన్‌గా పనిచేస్తున్నాడు. డ్యూటీకి వచ్చిన యాదయ్య రాత్రి పక్కనే ఉన్న పాత బస్సులు పార్కింగ్ చేసి ఉన్న బస్సు వద్ద భోజనం చేసి పడుకోగా, ఉదయం శవమై కనిపించాడు. కాగా, యదయ్య కుటుంబ సభ్యులు మాత్రం ఇది ముమ్మాటికి హత్యేనని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Comments

comments