Search
Tuesday 18 September 2018
  • :
  • :
Latest News

ఉల్కల వల్లే నీరు..!

Universal

భూమిపై జీవరాశి పుట్టుకకు నీరు కారణమని శాస్త్రీయంగా రుజువైన విషయం తెల్సిందే. అలాంటి నీరు ఈ భూమి మీదకు ఎలా వచ్చిందనే విషయంపై అమెరికాలోని మెసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు కొత్త విషయాలను వెల్లడించారు. మన సౌర వ్యవస్థ ఆవిర్భవించిన తొలి రెండు మిలియన్ సంవత్సరాల్లో భూమిపైకి ఉల్కలే నీటిని తీసుకొచ్చాయని చెబుతున్నారు. సౌరవ్యవస్థ తొలి దశలో ఈ ఉల్కలు ఎలా ఉండేవి? ఎక్కడ ఉండేవి? వాటిలో ఎంతమేరకు జలసంపద ఉండేది అన్నదానిపై మరింత అధ్యయనాన్ని చేస్తున్నట్లు మసాచుస్సెట్స్ టెక్నాలజీ సంస్థ (ఎమ్‌ఐటి)కు చెందిన ఆడమ్ సరాఫియాన్ వెల్లడించారు. అసలు ఉల్కలంటే అంతరిక్షంలోని శిథిల పదార్థాలు . సౌర మండలంలోని మంచు, వాయువులు , ధూళితో ఉల్కలు ఏర్పడతాయి. ఇవి మైక్రాన్ల నుంచి కొన్ని కిలోమీటర్ల మేర వ్యాసార్థాన్ని కలిగి ఉంటాయి. వీటికి నిర్దిష్ట కక్ష ఉండదు. అంతరిక్షంలో సంచరిస్తున్న శిథిల పదార్థం భూమి సమీపంలోకి వచ్చినప్పుడు గురుత్వాకర్షణకు లోనవుతుంది. ఫలితంగా భూమి వాతావర ణంలోకి ఆకర్షితమవుతాయి.

Comments

comments