Search
Sunday 23 September 2018
  • :
  • :
Latest News

వ్యవసాయ మార్కెట్‌లో రూ.2 కోట్లు నీళ్ళ పాలు

Water crops in the agricultural market of Rs. 2 crore

మార్కెట్ యార్డులో రూ.1.90 కోట్లతో నిర్మిస్తున్న ఓపెన్ షెడ్
నాణ్యత లేని నూతన షెడ్డు నిర్మాణం
మట్టి ఇసుకను ఉపయోగిస్తున్న వైనం
కనీస ప్రమాణాలు పాటించని కాంట్రాక్టర్
చూసీచూడనట్లుగా వదిలేస్తున్న అధికారులు

మనతెలంగాణ/మహబూబాబాద్ టౌన్ : మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌లో సుమారు రెండు కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న నూతన ఓపెన్ షెడ్డు నిర్మాణపు పనులలో కనిస నాణ్యత ప్రమాణాలు పాటించక పోవడంతో ఆ నిధులు నీళ్ళ పాలవుతున్నాయి. రైతులు వివిధ పంట ఉత్పత్తులను అమ్ముకునేందుకు వ్యవసాయ మార్కేట్ కు వస్తుంటారు. రైతులు పండించిన పంటలు అమ్ముకునే సమయంలో ఎండ, వాన నుండి రక్షణ కల్పించడానికి మార్కెట్ శాఖ నూతన ఓపెన్ షెడ్డు నిర్మాణపు పనులకు అనుమతినిచ్చింది. ఇందుకు గాను కోటి 90 లక్షల రూపాయలు కెటాయించి అన్‌లైన్ టెండర్ ద్వారా పనులు చేపట్టడానికి సదరు కాంట్రాక్టరుకు అప్పిగించింది. కాంట్రాక్టు దక్కించుకున్న కాంట్రాక్టరు కనీస ప్రమాణాలు పాటించకుండా పనులు చేపడుతున్నా అధికారులు అటు వైపు కన్నెతి కూడ చూడటం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. మట్టి ఇసుకను ఉపయోగించి నాణ్యత లేని షెడ్డు పిల్లరు పనులు చేపడుతున్న పనుల నాణ్యతను పరిక్షించిన అధికారులు లేరని విమర్శలొస్తున్నాయి. మట్టి ఇసుక, కంకర ఎక్కువ, సిమెంట్ తక్కువగా ఉపయోగిస్తున్నాడని మార్కేట్‌కు వస్తున్న రైతులు బాహ్యంగానే చర్చించుకుంటున్నారని సమాచారం. కొన్నేళ్ళ పాటుకూడా గట్టితనం లేని పనులు ఎందుకు చేపడుతున్నారని రైతులు కొంత మంది మార్కేట్ అధికారుల వద్దకు తీసుకెల్లిన పట్టించుకోవడంలేదని రైతులు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైన నాణ్యతతో కూడిన షెడ్డును నిర్మించడానికి మార్కేట్ శాఖ అధికారులు, ప్రజా ప్రతినిధులు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

Comments

comments