Search
Friday 21 September 2018
  • :
  • :
Latest News

ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు జరగాలి : ఎపి

krishna-boardహైదరాబాద్: కృష్ణా జలాల వివాదంపై రెండో రోజు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ విచారణ జరుపుతోంది. కేంద్రంతో సహా మహారాష్ట్ర, కర్నాటక, ఎపి, తెలంగాణ తమ వాదనలు వినిపించాయి. కృష్ణా జలాలపై తీర్పును బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ రిజర్వ్ చేసింది. విభజన చట్టంలోని సెక్షన్-89 ప్రకారం నాలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల నీటి కేటాయింపులు జరపాలని ఆంధ్రప్రదేశ్ సూచించింది. రెండేళ్లుగా మహారాష్ట్ర, కర్నాటక రిజర్వాయర్లలో పూర్తిస్థాయిలో నీటి నిల్వలు ఉంటే శ్రీశైలం, సాగర్‌లకు నీరు రాలేదని ఎపి తెలిపింది. ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు జరిగితే న్యాయం జరుగుతోందని ఎపి వాదించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మధ్యే కేటాయింపులు జరపాలన్న కర్నాటక డిమాండ్ సరికాదని పేర్కొంది. మొదటి నుంచి నీటి కేటాయింపులు జరపాలన్న ఎపి వాదన అర్థం లేదని కర్నాటక చెప్పింది. నీటి కేటాయింపులకు సెక్షన్-89కు సంబంధం లేదని కర్నాటక వాదించింది.

Comments

comments