Search
Tuesday 13 November 2018
  • :
  • :
Latest News

భద్రకాళి దేవస్థానంలో భక్తులకు నీరు కరువు

 Water for the devotees at Bhadrakali Temple

మన తెలంగాణ/ వరంగల్ అర్బన్ జిల్లా ప్రతినిధి : సముద్రం తలాపునున్నా… చేప దూపకేడ్చుతున్న చందంగా వరంగల్ నగరంలోని భద్రకాళీ దేవస్థానంలోని పరిస్థితి మారింది. నగరంలో పేరొందిన భద్రకాళీ దేవాలయం పక్కనే భద్రకాళీ చేరువు ఉన్నప్పటికీ దేవాలయంలోకి వచ్చే భక్తులకు నీళ్లు కరువవుతున్న దుస్థితి. నగరానికి మంచి నీరందించే భద్రకాళీ చేరువు నిత్యం దేవాలయంలోకి వచ్చే భక్తులకు కాళ్లు కడుక్కోవడానికి కూడా నీరందించడం లేదంటే ఆశ్చర్చాన్నీ కలిగిస్తోంద భక్తులు వాపోతున్నారు. దేవాలయంలోకి వచ్చే భక్తులకు అనేక రూపాలలో చార్జీలు వసూళ్లు చేసే ఆలయ కమిటీ భక్తుల సౌకర్యార్థం కాళ్లు కడుక్కోవడానికి నీరందించకపోవడం పట్ల భక్తులు అసహానం వ్యక్తం చేస్తున్నారు. నిత్యం వందలాది మంది భక్తులతో కిటకిటలాడే దేవాలయంలో చెప్పుల రక్షణ నుంచి మొదలు కొని గుడిలోకి వెళ్లి వచ్చే వరకు చార్జీలను వేస్తున్న కమిటీ భక్తులకు నీరు అందుబాటులో ఉండే విధంగా చూడకపోవడం విమర్శలకు తావిస్తోంది. సముద్రం లాంటి భద్రకాళి చెరువు నగరానికి మంచినీరందిస్తోందిని అలాంటి చేరువు పక్కనే ఉన్న భద్రకాళి ఆలయ భక్తులకు నీరందించకపోవడం విచారకరంగా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. శుక్రవారం భక్తులకు కనీసం కాళ్లు కడుక్కోవడానికి కూడా నీరు లేకపోవడం భద్రకాళి దేవాస్థాన కమిటీ నిర్లక్ష్యానికి సాక్షంగా నిలుస్తోంది.

ఆలయ ప్రారంభ ప్రాంగాణంలో భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన డ్రంబులలో నీరు లేక భక్తులు ఇబ్బందులు పడటం, ఆలయ కమిటీ పట్టించుకోకపోవడం పట్ల విమర్శలు వ్యక్తమయ్యాయి. నిత్యం ఆలయ కమిటీ ఆదాయ వనరుల పట్ల చూపుతున్న శ్రద్ద భక్తులకు సౌకర్యాలు కల్పించడంలో చూపడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. స్కూటర్ స్టాండ్, చెప్పుల స్టాండ్, ఫలహార ధరలు, తదితర రూపాలలో చార్జీలను వసూళ్లు చేస్తు ఆదాయాన్ని అర్జిస్తున్న దేవాలయ కమిటీ భక్తులకు కనీసం నీరందించలేని దుస్థితిలో ఉండటం పట్ల విమర్శలు మిన్నంటుతున్నాయి. పిల్లా జల్లాతో వచ్చే భక్తులకు ధర్శనం కోసం వెళ్లే భక్తులకు కనీసం కాళ్లు కడుక్కోండానికి కూడా నీరు లేక ఇబ్బందులు పడే స్థితి దారుణమని భక్తులు దేవాలయ కమిటీ తీరు పట్ల అసహానం వ్యక్తం చేస్తున్నారు. భక్తుల నుంచి ఆదాయాన్ని పొందటం పట్ల చూపుతున్న శ్రద్ధలో సౌకర్యాలు కల్పించడంలో లేకపోవడం గమనార్హం. ఇప్పటికైనా ఆలయ కమిటీ భక్తులకు సౌకర్యాలు కల్పించేందుకు దృష్టి సారించాల్సిన అవసరముందని నగర వాసులు భావిస్తున్నారు. దేవాదాయశాఖ ప్రత్యేక దృష్టి సారించి భద్రకాళి దేవస్థాన కమిటీ వ్యవహరిస్తున్న తీరుపట్ల తగు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

Comments

comments