Home జిల్లాలు ర్యాలంపాడు, గుడెందొడ్డి రిజర్వాయర్లకు జలకళ

ర్యాలంపాడు, గుడెందొడ్డి రిజర్వాయర్లకు జలకళ

Untitled-1ధరూర్: మండల పరిధిలోని ర్యాలంపాడు, గుడెందొడ్డి జలాశయాలు నీటితో కళకళలాడుతున్నాయి. గత 20రోజుల నుంచి జూరాలకు వస్తున్న వరద దారి మళ్లించి ర్యాలంపా డు, గుడెందొడ్డి జలాశయాలకు 1500 క్యూసెక్కుల నీటిని గత వారం రోజులుగా విడుదల చేస్తున్నారు. 1500 క్యూసె క్కుల నీరుతో జలాశయాలు పూర్తి నీటి మట్టంతో నిండి కళకళ లాడుతున్నాయి. గుడెందొడ్డి కింద 1200 ఎకరాలు, ర్యాలం పాడు కింద 1500 ఎకరాలు రాబోయే రబీకి రైతులు పంటలు వేసు కోవడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రథమ పంట వర్షాభావం లేక సరిగా రాకపోవడంతో రైతు లు రాబోయే రబీపై మొగ్గు చూపిస్తున్నారు. గుడెందొడ్డి, ర్యాలంపాడు జలాశయాలు పూర్తి గా నీటితో నిండడంతో వేసవికాలంలో తాగునీటి ఎద్దడి కూడా తీరుతుందన్నారు.
గ్రామాల ప్రజలు పేర్కొంటున్నారు.