Home జాతీయ వార్తలు యమునకు వరదలు

యమునకు వరదలు

వందలాది మంది సురక్షిత ప్రాంతాలకు తరలింపు, యుపిలో భారీ వర్షాలకు 58 మంది మృత్యువాత

Yamuna-River

చండీగఢ్: భారీ వర్షాలతో యమునానది ప్రమాదకర స్థాయిని మించిన ప్రవహించడంతో ఢిల్లీలోని ముప్పు ప్రాంతాలలో నివసిస్తున్న వందలాది మందిని శనివారం సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఢిల్లీలో యమునానది 205.06 మీటర్లకు మించి ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నట్లు నీటి పారుదల, ఆహార శాఖ అధికారులు తెలిపారు. దాదాపు 10 వేల మందిపై ప్రభావం పడిందన్నారు. నది ఒడ్డున, ముప్పు ప్రాంతాలల్లో నివసిస్తున్న వారిని అంతకు ముందు సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు నోడల్ ఆఫీసర్ అరుణ్ గుప్తా మీడియాకు తెలిపారు. యమునానది నీటిమట్టం మరింత పెరిగే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. ఢిల్లీకి తాగునీటిని అందించే హర్యానాలోని హత్నికుండ్ బ్యారేజ్ నుంచి అదనపు నీటిని నదిలోకి వదిలారు. ఇందుకు సంబంధించి ముంపు ప్రాంతాలలో నివసిస్తున్నవారికి ముందే సమాచారమిచ్చినట్లు తెలిపారు.
యుపిలో భారీ వర్షాలకు 58 మంది మృత్యువాత
లక్నో : ఉత్తరప్రదేశ్‌లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నా యి. జనజీవనం అతలాకుతలమైంది. వరదలు పోటెత్తుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వర్షం సంబంధిత ఘటనలకు గత మూడు రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 58 మంది ప్రాణాలు కోల్పోయారు. అత్యధికంగా షహరన్‌పూర్‌లో 11 మంది మృతి చెందినట్లు లక్నోలోని సహాయక చర్యల కార్యాలయ అధికార ప్రతినిధి పేర్కొన్నారు. ఆగ్రాలో పది మంది, మీరూట్‌లో ఆరుగురు చొప్పున, మెయిన్‌పురిలో నలుగురు, కసగంజిలో ముగ్గురు, బరియెల్లి, బఘపట్, బులందషహర్‌లో ఇద్దరేసి చొప్పున, కాన్పూర్ దెహత్, మథుర, గజియాబాద్, హపూర్, రాయ్ బరేలి, జలౌమ్, జౌన్‌పూర్, ప్రతాపగఢ్, బండ, ఫిరోజాబాద్, ఆమేథి, కాన్పూర్, ముజఫర్‌నగర్‌లో ఒక్కరేసి చొప్పున మరణించినట్లు ఆయన చెప్పారు.

సోనెభంద్ర, మిర్జాపూర్, చం దౌలి, వారణాసి, ఘాజిపూర్, బల్లియ, ఆజాంగఢ్, డియోరియా తదితర జిల్లాల్లో ఉరుములతో కూడిన భారీ నుంచి అతి భారీవర్షాలు కరిసే అవకాశముందని వాతావరణశాఖ హెచ్చరించిందన్నారు. మీరూట్‌లో 23 సెంటీమీటర్ల వర్షంపాతం నమోదైందన్నారు. వరద ప్రాంతా ల్లో ప్రజలను అప్రమత్తం చేయాలని అన్ని జిల్లాల అధికారులను సిఎం ఆదిత్యనాథ్ ఆదేశించారన్నా రు. శిథిలావస్థకు చేరుకున్న భవనాలను గుర్తించి అం దులో నివసిస్తున్న వారిని తరలించాలని కూడా ఆదేశించినట్లు ఓ ప్రభుత్వ అధికార ప్రతినిధి వెల్లడించారు. పలి యా కలాన్, ఎల్గిన్ బ్రిడ్జి(బరబంకి) వద్ద శారదా, ఘాఘ్రా నదులు ప్రమాదస్థాయిలో ప్రవహిస్తున్నట్లు సెంటర్ వాటర్ కమిషన్ ఒక బులెటన్‌ను విడుదల చేసింది.