Search
Saturday 22 September 2018
  • :
  • :
Latest News

చికెన్ పరిశ్రమతో ప్రారంభమైన ప్రమాద ఘంటికలు..?

భరించలేని దుర్వాసన ..ఈగల సంచారంతో ప్రజల బేజార్
భూగర్భ జలంలో కలుస్తున్న చికెన్ వ్యర్థ రసాయనాలు
అనారోగ్యం బారిన పడుతున్న  వెల్టూర్ గ్రామస్తులు
ఉద్యమానికి పిడికిలి బిగించిన వెల్టూర్ గ్రామస్థులు

                   Chicken-Industry

పెద్దమందడి: మండల పరిధిలోని వె ల్టూర్ గ్రామానికి ప్రమాదం పొంచిఉంది. గ్రామానికి అతి సమీపంలో ఏర్పాటు చేసిన చికెన్ పరిశ్రమలో విడుద లౌతున్న భారీ వ్యర్థ రసాయనాలతో గత ఏడాది నుండి వెల్టూర్ గ్రామస్తులు తీవ్ర అనారోగ్యం భారిన పడు తున్నారు.వ్యర్థ రసాయనాలతో పాటు చెడు దుర్వాసన వెదజల్లడంతో గ్రామంలో వింత జాతి ఈగలు భారీగా సంచరించడంతో గ్రామంలో రోజు రోజుకు ప్రజలు ఇ బ్బందులకు గురికాక తప్పడం లేదు.

చికెన్ పరిశ్రమలో వస్తున్న వ్యర్థ రసాయనాలను అరికట్టాలని పర్యావరణ పరిరక్షణ శాఖా అధికారులకు ,జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన ఫలితం లేకపోవడంతో గ్రామస్తులు ఏక మై అటు చావో ఇటు కంపెనీ కొనసాగడమో అనే విధం గా తెగించి పోరాటానికి సిద్దమయ్యారు.శనివారం దాదాపు గ్రామా నికి చెందిన 300 మందికి పైగా గ్రామస్తులు స్నేహ చికెన్ పరిశ్రమను ముట్టడించి తమ నిరసన వ్యక్తం చేశారు. ఎన్నో రోజులుగా తాము అభ్యంతరం వ్యక్తం చేస్తున్న కంపెనీ యాజమాన్యం పట్టించు కోకుండా వెల్టూర్ గ్రామ స్తుల ఆరోగ్యంతో ఆటలాడుకుంటుందని వెల్టూర్ గ్రామ స్తులు వాపోతున్నారు.

చికెన్ పరిశ్రమకు సంబందించిన వ్యర్థ రసాయనాలు భూమిలోకి ఇంకడంతో వెల్టూర్ గ్రామానికి మంచి నీరు అందించేందుకు వేసిన బోర్లల్లో చికెన్ పరిశ్రమ వ్వర్థాలతో కూడిన నీరు కలుషితమై ఎర్రటి రంగులో బోర్ల నుండి నీరు సరఫరా అవుతుందని గ్రామస్తులు అంటున్నారు. వర్షాకా లంలో ఈ పరిస్థితి మరింత ధారుణంగా ఉంటుందని గ్రా మస్తులు వాపోయ్యారు.

 కంపెనీ మూసే వరకు ఉధ్యమిస్తాం: కుర్వ బాల్‌చంద్రయ్య సర్పంచ్ వెల్టూర్

చికన్ కంపెనీకి చెందిన వ్యర్థ రసాయనాల వల్ల వెల్టూర్ గ్రామంలో ప్రజలు కలుషిత నీరు తాగి,దుర్వాసన కారణంగా వచ్చే ఈగ ల వల్ల ప్రజలు ఎంతో ఇబ్బందులకు గురౌతూ అనారోగ్యం పాలౌతు న్నారని మహబూబ్‌నగర్, వనపర్తి రెండు జిల్లాల కలెక్టర్లు స్పందించి చికన్ కంపెనీని మూసేసే వరకు ఉధ్యమిస్తామని వెల్టూర్ సర్పంచ్ కుర్వ బాల్‌చంద్రయ్య తెలిపారు.గ్రామస్తులు ఆరోగ్యం కంటే తమకు ఏది ఎక్కువ కాదని ఆయన తెలిపారు. శనివారం 300 మంది గ్రామస్తులు స్నేహ చికెన్ కంపెనీని ముట్టడించామని త్వరలో అధికారులు చర్యలు తీసుకోకపోతే కంపెనీ ముందు నిరాహార దీక్షలు చేస్తామని ఆయన తెలిపారు.

కాలుష్యం కారణంగా పంటలు పండడం లేదు: వెంకటయ్య మాజీ వైస్ ఎంపిపి

చికెన్ కంపెనీ నుండి విడుదలౌతున్న వ్యర్థ రసా యనా లతో వెల్టూర్ గ్రామానికి చెందిన రైతుల పొలాలు పంట లు కూడా పండడం లేదని మాజీవైస్ ఎంపిపి సాక వెంక టయ్య అన్నారు. సారవంతమైన ఈ భూముల వల్ల గతం లో రైతుల వ్యవసాయం చేసి లబ్దిపొందేవారని కంపెనీ పుణ్యమా అని రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పర్యావరణ శాఖాధికారుల నిర్లక్షం కారణంగా వెల్టూర్ గ్రామ స్తు లు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన అన్నారు.

పరిశ్రమను మూసివేయాలి: రఘుపతి రెడ్డి టిఆర్‌ఎస్ నాయకులు

ప్రజల ఆరోగ్యానికి ఇబ్బంది కల్గించే చికెన్ పరిశ్ర మను మూసివేయాలని వెల్టూర్ గ్రామానికి చెంది న టిఆర్‌ఎస్ నాయకులు రఘుపతి రెడ్డి తెలిపా రు. ప్రజల ఆరోగ్యాని కంటే మించింది ఏమి లేదని వెల్టూర్ గ్రామస్తుల కోరిక మేరకు కంపెనీ సమస్యపై ఉన్నతాధికారులు, నాయకుల దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తామని న్యాయం జరిగేంత వరకు గ్రామస్తులతో కలిసి ఉధ్యమిస్తామని రఘుపతి రెడ్డి పేర్కొన్నారు.

Comments

comments