Home జిల్లాలు నిమజ్జనానికి  ‘నీటి’ కష్టాలు!

నిమజ్జనానికి  ‘నీటి’ కష్టాలు!

Untitled-1సంగారెడ్డి: ఏ కార్యక్రమమైనా ప్రారంభించి, నిరంతరాయంగా సాగాలంటే ముందుగా వినాయకు డికి పూజలు నిర్వహిస్తారు. విఘ్నేషున్ని పూజిస్తే ఏ ఆటంకాలు రావని నమ్మకం. ఆటంకాలు తొలగించే వినాయకుడికే ఈసారి ‘నీటి’ కష్టం పడింది. వానలు సకాలంలో పడకపోవడంతో.. సాగునీటి ప్రాజెక్టు అయిన సింగూరు ప్రాజెక్టు నీటి మట్టం పెరగలే దు. చెరువులు, కుంటలు నిండలేదు. దీంతో ఈ నెలలోనే నిర్వహించే వినా యక నిమజ్జనాలు ఎక్కడ చేయాలో అర్థంకాని స్థితిలో జిల్లా లోని భక్తులు ఉన్నారు. ఈ నెల 17న వినాయక చవితి పండుగ ఉంది. పండుగను పురస్కరించుకుని ఎక్కడిక క్కడే స్థానిక పరిస్థితులను బట్టి వినాయకులను నిమజ్జ నం చేస్తారు. కొన్ని చోట్ల ఐదు రోజులకు, మరికొన్ని చోట్ల 9 రోజులకు, ఇంకొన్ని చోట్ల 11రోజులకు నిమ జ్జనం చేస్తారు. జిల్లాలోని మూడు డివిజన్ల పరిధిలోని 46 మండలాలు, మున్సిపాల్టీలు, గ్రామాల్లో వివిధ యూనియన్లు, సంఘాలు ఆధ్వర్యంలో వినాయకుల ను ప్రతిష్టిస్తారు. అప్పటి నుంచి నిమజ్జనం వరకు పూజలు నిర్వహించి తమతమ మొక్కుల ను తీర్చు కుంటారు. అయితే ఈ పండుగకు ఈసారి ఆటంకాలు తప్ప దా? అన్న ప్రశ్న ఉదయిస్తోంది. సింగూరులో తగ్గిన నీటి మట్టం
జిల్లాలోని పుల్కల్ మండలంలో సింగూరు ప్రాజెక్టు ఉంది. ఈ ప్రాజెక్టులో నీరు ఉంటే ఆ ప్రాజెక్టుకు వెళ్లి వివిధ గ్రామాలు, పట్టణాల వారు వినాయ కులను నిమజ్జనాలు చేస్తుంటారు. కొన్ని గ్రామాల వారు సమీపంలో ఉన్న చెరువులు, కుంటల్లో, బావుల్లో నిమజ్జనాలు చేస్తారు. కానీ ఈ సారి చెరు వుల్లో నీటి చుక్క లేకపోవడంతో సింగూరు ప్రాజెక్టే దిక్కవుతోంది. అక్కడ కూడా నీరు లేకపోవడంతో వినాయకులను నిమజ్జనం చేసేందుకు ప్రజ లు, భక్తులు తీవ్ర ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడింది. సంగారెడ్డి, కంది, అంథోల్, మల్కాపూర్, మెదక్, తదితర చెరువుల్లో ఉన్న కొద్ది పాటి నీటిలో నే నిమజ్జనం తప్పదా?అని భక్తులు ఆలోచిస్తున్నారు.
15 ఏళ్ల కిందట గతేనా..?
ప్రతి ఏటా నిర్వహించే వినాయక నిమజ్జన కార్యక్రమానికి 15ఏళ్ల గతేనా…? ఈ సారి కూడా అనే అనుమానాలు ప్రజల్లో తలెత్తుతున్నా యి. 2002 సంవత్సరంలోనూ వినాయక నిమజ్జన సమయానికి నీళ్లు లేక ఇక్కట్లు పడ్డారు. సింగూరు పరిసర ప్రాంతాల్లోని భారీ విగ్రహాలు నిమజ్జ నానికి నోచుకోలేకపోయాయి. కొన్ని భారీ విగ్రహాలు నీటిలో పూర్తిగా కాకుండా సగం వరకే మునిగాయి. ఈ ఖరీఫ్‌లో ఇప్పటి వరకు అడ పాదడపా వానలు తప్ప సరైన వానలు లేవు. వారం రోజల కింద కురిసిన భారీ వర్షం తప్ప అంతకు ముందు పెద్దగా జిల్లాలో వానలు పడ లేదు. దీంతో పడిన కొద్ది పాటి వాన కూడా భూమిలో ఇంకి పోయే పరిస్థితి ఉంది. దీంతో చెరువులు, కుంటల్లో చెప్పుకోదగిన స్థాయిలో నీటి నిల్వలు చేర లేదు. ఇటీవల ప్రతి మండలంలో 25 శాతం చెరువులను మిషన్ కాకతీయ కింద పునరుద్ధరణ చేపట్టారు. ఈ చెరువులు కూడా ఇంకా వాన నీటి కోసం నోళ్లు తెరుచుకుని ఎదురు చూస్తున్నాయి. అందువల్ల ఈ సారి కూడా అలాంటి పరిస్థితి రాకుండా చూడాలని ప్రజలు, భక్తులు కోరుతున్నారు. నవరాత్రులు ప్రారంభమై ముగిసే లోగా గట్టి వానలు పడితే జలాశయాల్లో నీరు చేరే అవకాశ ముంది. తద్వారా నిమజ్జన కార్యక్రమాలకు కొంత ఇబ్బందులు తొలగు తాయి. ఇదిలా ఉంటే మార్కె ట్‌లో వినాయక విగ్రహాలు ఊపందుకు న్నాయి. మండలపాల ఏర్పాటు తుది దశకు చేరింది. సంగారెడ్డితో పా టు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో భక్త మండళ్లు మండపాల నిర్మాణం, విగ్రహాల కొనుగోలు, తరలింపులో నిమగ్నమయ్యారు. దీంతో కూడళ్ల లో సందడి కనిపిస్తోంది.