Search
Saturday 22 September 2018
  • :
  • :

గోదావరి నది పై ప్రాజెక్టుల నిర్మాణంతో నీటి సమస్య తీరుతుంది: ఇంద్రకరణ్

Indra-Karan-Reddyఆదిలాబాద్: తెలంగాణ ప్రజల నీటి కష్టాన్ని తీర్చేందుకు సిఎం కెసిఆర్ కృషి చేస్తున్నారని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. గోదావరి నదిపై బ్యారేజీల నిర్మాణంతో తెలంగాణ ప్రజల తాగునీటి, సాగునీటి కష్టాలు తీరుతాయని ఆయన పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లా గోదావరి నది ఉండికూడా ఇప్పటి వరకు మంచి నీళ్లు అందివ్వలేదని ఆవేధన వ్యక్తం చేశారు. ఆదిలాబాద్ జిల్లా నీటి కష్టాలు తీరుతాయన్నారు. గత ప్రభుత్వాల ప్రణాళికల లోపం, నిర్లక్షం వల్లే భారీ ప్రాజెక్టుల నిర్మాణం జరగలేదని పేర్కొన్నారు. సిఎం కెసిఆర్, మంత్రి హరీశ్ రావు చొరవ వల్లే మహారాష్ట్ర ప్రభుత్వం పాజెక్టుల నిర్మాణ ఒప్పందానికి ముందుకు వచ్చిందని పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని నిర్మల్ పట్టణానికి వేసవిలో తాగునీటి సమస్యలేకుండా చేస్తామన్నారు.

Comments

comments