Home జాతీయ వార్తలు శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నీటి విడుదల

శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నీటి విడుదల

SRISAILAM

కర్నూలు : శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. శనివారం మధ్యాహ్నం ఏడు గేట్లను ఎత్తివేసి దిగువకు రెండు లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఈ ప్రాజెక్టుకు ప్రస్తుతం ఇన్‌ఫ్లో 2,39,793 క్యూసెక్కులుగా ఉండగా, ఔట్‌ఫ్లో 2,83,793 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుత నీటి మట్టం 884.5 అడుగులుగా ఉంది. జలకళను సంతరించుకున్న శ్రీశైలం ప్రాజెక్టును చూసేందుకు పర్యాటకులు భారీ ఎత్తున తరలివస్తున్నారు.

Water Release from Srisailam Project