Search
Saturday 17 November 2018
  • :
  • :
Latest News

నీళ్ల చారు.. ఉడకని గుడ్లు

CURRY
* కొత్తపల్లి పాఠశాలలో వంట సిబ్బంది నిర్వాకం
మన తెలంగాణ/ నవాబ్‌పేట్ : ప్రభుత్వ పాఠశాలల్లో నిరుపేద విద్యార్థుల కడుపు నింపడానికి రాష్ట్ర ప్రభుత్వం కోట్ల రూపాయల వ్యయంతో ప్రతిష్ఠాత్మకంగా మధ్యా హ్న భోజన పథకాన్ని అమలు చేస్తున్న తరుణంలో వంట ఏజెన్సీల కక్కుర్తికి, సంబంధిత అధికారుల,పాఠశాల ఉ పాధ్యాయుల నిఘా కరువై చిన్నారులు నీళ్లచారు,ఉడకని గ్రుడ్లతో రుచులు లేకుండా చప్పకూడే తినాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్‌పేట్ మం డల పరిధిలోని కొత్తపల్లి ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం మధ్యాహ్న భోజనాన్ని మన తెలంగాణా పరిశీలించగా వంట సిబ్బంది మెనూ పాటించకుండా నీళ్లచారు తో,ఉడకని గ్రుడ్లతో భోజనాలు వడ్డిస్తున్నారు. చిన్నారి వి ద్యార్థులు ముందుకొచ్చి పాఠశాలలో ప్రతిరోజూ ఇలాగే పురుగుల అన్నం, పలుచటి చారు వడ్డిస్తారని అనడం మ రోసారి అడిగితే వంట సిబ్బంది కోప్పడతారని వారి ఆవేదనను ప్రధాన ఉపాధ్యాయుడు, వంట సిబ్బంది ముందే ధైర్యంగా తెలిపారు.నిరుపేద విద్యార్థుల కడుపులు నింపడానికి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మధ్యా హ్న భోజన పథకం మండలంలోని మరెన్నో పాఠశాలల్లో వంట ఏజెన్సీ సిబ్బంది కక్కుర్తికి అధికారులు,ఉపాధ్యాయుల నిఘాలేమి తోడవడంతో పేద విద్యార్థులకు రుచిలేని చప్పకూడే దిక్కుగా మారింది. నాసిరకం భోజనాల విషయాన్ని పాఠశాల హెచ్‌ఎం నారాయణను వివరణ కోరగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు నాణమైన భోజనం అందించడానికి ప్రభుత్వం వంట సిబ్బందికి డబ్బులను చెల్లిస్తుందని,ఎట్టి పరిస్థితుల్లోనూ మధ్యాహ్న భోజనంలో నాణ్యతలేమిని ఉపేక్షించేది లేదని అన్నారు. అధికారులు వెంటనే స్పందించి విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్న భోజనాలు అందించేందుకు కృషిచేయాలని ప్రజలు కోరుతున్నారు.

Comments

comments