Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

తాగునీటి సమస్య ఉన్న చోట ట్యాంకర్లతో నీటి సరఫరా

speak3

మన తెలంగాణ/నిర్మల్ ః వేసవిలో ప్రజలకు తాగునీటి సమస్య రాకుండా చూడాలని జిల్లా కలెక్టర్ యం. ప్రశాంతి అధికారులను ఆదేశించారు. సోమవారం గ్రీవెన్స్‌సెల్ ప్రజాఫిర్యాదుల విభాగంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన దరఖాస్తులను ఆమె స్వీకరించారు. భైంసా మండలంలోని లింగ గ్రామానికి చెందిన ప్రజలు తమకు తాగునీటి సరఫరా చేయడం లేదని, నీరు లేక చాలా ఇబ్బందులకు గురవుతున్నామని తెలుపగా సంబంధిత గ్రామ సర్పంచ్‌కు ఫోన్ చేసి వెంటనే ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయాలని ఆదేశించారు.. జిల్లాలోని ఎక్కడైన నీటి సమస్య ఉంటే వెంటనే తగు చర్యలు తీసుకోవాలన్నారు. గ్రీవెన్స్‌సెల్‌కు వచ్చే దివ్యాంగు ల కోసం వీల్ చైర్ ప్రజావాణి కార్యక్రమం నిర్వహించే స్థలంలో ఏర్పాటు చేయాలని దివ్యాంగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సందర్భంగా వివిధ శాఖల వారీగా పెండింగ్‌లో ఉన్న ప్రజాఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి రమేష్‌రాథోడ్, భైంసా ఆర్‌డిఒ రాజు,సిపిఒ మల్లికార్జున్,బిసి సంక్షేమ అధికారి విజయ్‌కుమార్,ఎస్సీ సంక్షేమ అధికారి బాలాసురేందర్, జిల్లావ్యవసాయ అధికారి అమ్రేష్‌కుమార్, ఎల్‌డియం దేబ్‌జాని, ప్రమానిక్, జిల్లా ఐసిడిఎస్ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Comments

comments