Search
Saturday 21 July 2018
  • :
  • :
Latest News

ఎడారి గాలి నుంచి నీరు

Desert-in-Rajasthan

ఎడారిలోని గాలి నుంచి మంచినీరు తయారు చేసే ప్రక్రియను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఘోరమైన ఎడారి ప్రాంతాల్లో జీవించే ప్రజల దాహార్తిని, ఇతర అవసరాలను తీర్చడానికి మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎంఐటి) శాస్త్రవేత్తలు ఈ సాంకేతిక ప్రక్రియను రూపొందించారు. వినియోగదారులు ఈ టెక్నాలజీని ఉపయోగించి గాలి నుంచి నీటిని తయారు చేసుకోవచ్చు. ప్రతి ఎడారి గాలిలో ఎంతో కొంత తేమ ఉంటుంది. ఆ తేమ నుంచే నీటిని రాబట్టుకునేటట్టు ఇది పని చేస్తుంది. గత ఏడాది ఈ సాంకేతికత ప్రతిపాదన తెరపైకి వచ్చింది. మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్ వర్క్‌పై సూర్యరశ్మి ఆధారంగానే ఈ కొత్త ప్రక్రియ పనిచేస్తుంది.

Comments

comments