Home తాజా వార్తలు శిధిలావస్థలో వాటర్ ట్యాంక్‌లు… భయంతో ప్రజలు

శిధిలావస్థలో వాటర్ ట్యాంక్‌లు… భయంతో ప్రజలు

Water tank

 

భద్రాద్రి కొత్తగూడెం: జిల్లాలోని వేంసూరు మండల కందుకూరు గ్రామంలో గల వాటర్ ట్యాంక్ శిధిలావస్థకు చేరు కోవడంతో ఎప్పుడు కూలుతుందోనని ప్రజలు భయాందోళన చెందుతున్నారు. వివరాల్లోకి వెళ్లితే… మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరావు 2000ల సంవత్సరంలో దీనికి శంకుస్థాపన చేశారు. అనంతరం 2003లో రూ.23లక్షల వ్యయంతో ఈ వాటర్ ట్యాంక్‌ను నిర్మించి, తుమ్మలే ప్రారంభించారు. ఈ ట్యాంకు మర్లపాడు నుండి కందుకూరు ఊరి చివర మూలమలుపు వద్ద ఉంది. ట్యాంక్ పూర్తిగా శిధిలమై పోవడంతో ఏ క్షణంలో కూలుతుందోనని ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటున్నారు. గత కొన్నేళ్ళుగా కూలేందుకు సిద్ధంగా ఉన్న వాటర్ ట్యాంక్‌ను తొలగించి ప్రాణాపాయ స్థితి నుండి తమను కాపాడాలని ప్రజలు ప్రజాప్రతినిధులకు, అధికారులకు మొరపెట్టుకున్నా ఫలితం శూన్యమని ప్రజలు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సంబంధిత అదికారులు ఈ విషయంపై చొరవ తీసుకొని శిధిలమైపోయి కూలేందుకు సిద్ధంగా ఉన్న ఈ వాటర్ ట్యాంక్‌ను వెంటనే తొలగించాలని స్థానిక ప్రజలు ముక్త కంఠంతో కోరుతున్నారు.

Water tank ruined at village