Search
Thursday 20 September 2018
  • :
  • :

మూసీ ఆయకట్టుకు నీరు

mini

ప్రాజెక్టు నుంచి కుడి, ఎడమ కాల్వలకు మంత్రి జగదీశ్ రెడ్డి విడుదల 

మన తెలంగాణ / కేతేపల్లి : మూసీ ప్రాజెక్టు ఆయకట్టు పరిధిలోని ప్రతి రైతుకు సాగునీటిని అందిస్తామని రాష్ట్ర విద్యుత్, ఎస్‌సి సంక్షేమ శాఖమంత్రి గుంతకండ్ల జగదీశ్‌రెడ్డి చెప్పారు. మూసీ ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువల కింద ఖరీఫ్ సాగుకు నీటిని ఎంఎల్‌ఎ వేముల వీరేశం తో కలిసి మంత్రి ఆదివారం విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత పాలకుల నిర్లక్షం వివిధ ప్రాజెక్టుల ఆయకట్టు రైతులకు శాపంగా మారిందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ప్రాజెక్టుల అభివృద్ధికి అధిక ప్రాధాన్యతనిస్తూ ముఖ్యమంత్రి కెసిఆర్ అధిక నిధులు మంజూరు చేశారన్నారు. మూసీ ప్రాజెక్టుకు రూ.20కోటతో అభివృద్ధి పనులు జరిగి నూతన గేట్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దీంతో ప్రాజెక్టులోకి వచ్చిన ప్రతి నీటి చుక్కను ఒడిసిపట్టి లీకేజీలను అరికట్టడం ద్వారా ఎన్నడూ లేని విధంగా ఖరీఫ్ సీజన్‌లో ప్రాజెక్టును నింపుకున్నామన్నారు. ప్రాజెక్టు ఆయకట్టు పరిధిలోని 30వేల ఎకరాలకు సాగునీరు అందించడంతో రైతుల ముఖాలలో ఆనందం వెల్లువి రుస్తుందన్నారు. గత 28 సంవత్సరాలలో ఎన్నడూ లేని విధంగా ఈ ప్రాజెక్టుకు వానకాలం సీజన్‌లోనే నీరు వచ్చి నిండుకుండలా మారిందన్నా రు. జిల్లాలోని అన్ని ప్రాంతాల రైతులకు సాగునీరందించి జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ కృతనిశ్చయంతో ఉన్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వేముల వీరేశం, నీటి పారుదల శాఖ ఎస్‌ఈ హామీద్‌ఖాన్, ఈఈ సంజీవరెడ్డి, డీఈ నవీకాంత్, ఎంపీపీ గుత్త మంజుల, జడ్పీటీసీ జటంగి లక్ష్మమ్మ, రైతు సమన్వయ సమితి మండల కో ఆర్డినేటర్ కంచర్ల మహేందర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Comments

comments