Home నిర్మల్ నీటి తొట్టెలు ఇలా…పశువుల దాహం తీరేదెలా…?

నీటి తొట్టెలు ఇలా…పశువుల దాహం తీరేదెలా…?

wat= నిరుపయోగంగా నీటి తొట్టెలు
= దాహంతో అల్లాడుతున్న పశువులు
= పట్టించుకోని అధికారులు

మన తెలంగాణ/కుబీర్ : మండలంలోని పలు గ్రామాలలో పశువుల దాహార్తిని తీర్చేందుకు నీటి తొట్టెలను నిర్మించారు. నిర్మించిన నీటి తొట్టెలు ఏ గ్రామంలోను ఉపయోగంలో లే వు… ఉపాధి హామీ, వాటర్‌షెడ్ నిధులతో మండలంలోని చాలా గ్రామాలలో నీటి తొట్టెలను నిర్మించారు. కొన్ని గ్రామా లలో నిర్మించినప్పటి నుంచి నిరుపయోగంగానే ఉన్నాయి. నీటి తొట్టెలలో నీరు నింపకపోవడంతో శిథిలావస్థకు చేరి నిరుపయోగంగా మారాయి.
మండల కేంద్రమైన కుబీర్‌లో నీటి తొట్టెలలో నీరు నింప కపోవడంతో నీటి తొట్టెలో పిచ్చి మొక్కలు పెరిగి వెక్కిరిస్తు న్నాయి. మండలంలోని రాజురా గ్రామంలో నీటి తొట్టెలో నీరు నింపకపోవడంతో శిథిలా వస్థకు చేరి నిరుపయోగంగా మారింది.
ఈ సంవత్సరం నామమాత్రంగా వర్షాలు కురువడంతో వాగులలో, చెరువులలో నీరు లేకుండా ఉన్నాయి. దీంతో పశువులు తాగు నీటికోసం అల్లాడుతున్నాయి. కొందరు రైతు లు పశువులకు ఇంటి వద్ద నీరు పెడుతున్నారు. ఉదయం చేనులోకి వెళ్లే సమయంలో నీరు పెడు తున్న రైతులు సాయంత్రం వరకు పశువులు నీళ్లు లేక అల్లాడుతున్నాయి. లక్షలు వెచ్చించి నిర్మించిన నీటి తొట్టెలు నిరుపయోగంగా మారడంతో ప్రజా ధనం వృథా అయిందని పలువురు మండల ప్రజలు అంటున్నారు.
ప్రభుత్వాలు ప్రజల సంక్షేమంతోపాటు మూగ జీవాలను కూడా దృష్టిలో ఉంచుకుని ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టింది. వేసవి కాలంలో పశువులకు దాహార్తిని తీర్చేందుకు ప్రతి గ్రామంలో నీటి తొట్టెలు నిర్మించేలా చర్యలు చేపట్టింది. అధికారుల నిర్లక్షం వల్ల ప్రభుత్వ ఆశయం నీరుగారు తుందని పలువురు వాపోతున్నారు. అధికారుల నిర్లక్షం వల్లే నీటి తొట్టెలు నిరుపయోగంగా ఉన్నాయని మండల ప్రజలు అంటున్నారు. ఒకటో రెండో గ్రామాలు మినహాయిస్తే ఏ గ్రామంలో కూడా నీటి తొట్టెలు ఉపయోగంలో లేవని పలువురు అంటున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతా ధికారులు స్పందించి మండలంలో నిరుపయోగంగా ఉన్న నీటి తొట్టెలలో నీరు నింపేలా చర్యలు చేపట్టి పశువుల దాహార్తిని తీర్చాలని మండల రైతులు కోరుతున్నారు.