Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

ముర్రే, వావ్రింకా ముందంజ

  • ప్రిక్వార్టర్స్‌లో హలెప్, వోజ్నియాకి, రద్వాన్‌స్కా ఔట్, ఫ్రెంచ్ ఓపెన్

Murray-Wawarinka

పారిస్: ప్రతిష్టాత్మకమైన ఫ్రెంచ్ ఓపెన్‌లో టాప్ సీడ్ ఆండీ ముర్రే, మూడో సీడ్ వావ్రింకా మూడో రౌండ్‌లో విజయం సాధించారు. మహిళల సింగిల్స్‌లో మూడో సీడ్ సిమోనా హలెప్, పదకొండో సీడ్ వోజ్నియాకి ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నారు. అయితే మహిళల సింగిల్స్‌లో తొమ్మిదో సీడ్ రద్వాన్‌స్కా(పోలండ్) మూడో రౌండ్‌లోనే ఓటమి పాలైంది. ఫ్రాన్స్‌కు చెందిన యువ సంచలనం అలిజె కార్నెట్‌తో జరిగిన పోరులో రద్వాన్‌స్కా కంగుతింది. ఇతర పోటీల్లో ఏడో సీడ్ మారిన్ సిలిక్ (క్రోయేసియా), స్పెయిన్ ఆటగాడు వెర్దాస్కో మూడో రౌండ్‌లోవిజయం సాధించారు.
ఎదురులేని ముర్రే..
మరోవైపు అగ్రశ్రేణి ఆటగాడు ముర్రే మూడో రౌండ్‌లో 7-6, 7-5, 6-0 తేడాతో అర్జెంటీనాకు చెందిన డెల్‌పొట్రోను ఓడించాడు. తొలి రెండు సెట్లు టైబ్రేకర్ వరకు వెళ్లింది. అయితే పూర్తి ఏకాగ్రతతో ఆడిన ముర్రే ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. చూడచక్కని షాట్లతో ప్రత్యర్థిని హడలెత్తించాడు. డెల్‌పొట్రో కూడా రెండు సెట్లలో ముర్రేకు గట్టి పోటీ ఇచ్చాడు. అయితే ఫలితాన్ని తేల్చే మూడో సెట్‌లో మాత్రం చేతులెత్తేశాడు. చెలరేగి ఆడిన ముర్రే ఒక్క గేమ్‌ను కూడా కోల్పోకుండానే మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. మరోవైపు మూడో సీడ్ వావ్రింకా (స్విట్జర్లాండ్) కూడా ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నాడు. ఇటలీ ఆటగాడు ఫోగ్‌నినితో జరిగిన మూడో రౌండ్‌లో వావ్రింకా 7-6, 6-0, 6-2 తేడాతో జయకేతనం ఎగుర వేశాడు. తొలి సెట్‌లో కాస్త ప్రతిఘటన ఎదుర్కొన్న వావ్రింకా తర్వాత చెలరేగి పోయాడు. ప్రత్యర్థిని ఏమాత్రం కోలుకోనివ్వకుండా ముందుకు సాగాడు. వరుసగా మూడు సెట్‌లు గెలిచి నాలుగో రౌండ్‌కు దూసుకెళ్లాడు.
సిలిక్ అలవోకగా..
మరో పోటీలో ఏడో సీడ్ మారిన్ సిలిక్ (క్రొయేసి యా) విజయం సాధించాడు. స్పెయిన్ ఆటగాడు లోపెజ్‌తో జరిగిన పోరులో సిలిక్ అలవోక విజయాన్ని అందుకున్నాడు. ఏకపక్షం గా సాగిన పోరులో సిలిక్ 6-1, 6-3, 6-3 తేడాతో సునాయాస విజయం సాధించి నాలుగో రౌండ్‌లో ప్రవేశించాడు. మరోపోటీలో వెర్దాస్కో (స్పెయిన్) విజయం సాధించాడు. ఏకపక్షంగా సాగిన మూడో రౌండ్‌లో వెర్దాస్కో 6-2, 6-1, 6-3 తేడాతో ఉరుగ్వే ఆటగాడు క్యూవాస్‌ను చిత్తు చేసి ముందంజ వేశాడు.
హలెప్ జోరు..
మహిళల సింగిల్స్‌లో రుమేని యా స్టార్ సిమోనా హలెప్ ముందంజ వేసింది. శనివారం జరిగిన మూడో రౌండ్‌లో హలెప్ 6-0, 7-5 తేడాతో రష్యా క్రీడాకారిణి కసాత్కి నాను ఓడించింది. తొలి సెట్‌లో హలెప్ ప్రత్యర్థికి ఒక్క గేమ్‌ను కూడా గెలుచుకునే ఛాన్స్ ఇవ్వలేదు. అయితే రెండో సెట్‌లో మాత్రం కసాత్కినా సర్వం ఒడ్డింది. చూడ చక్కని షాట్లతో హలెప్‌ను ముప్పుతి ప్పలు పెట్టింది. కానీ, ఒత్తిడికి తట్టుకోలేక కీలక సమ యంలో చేతులెత్తేసింది. మరోవైపు తొమ్మిదో సీడ్ రద్వాన్‌స్కా మూడో రౌండ్‌లోనే ఇంటిదారి పట్టింది. ఫ్రాన్స్ క్రీడాకారిణి అలిజె కార్నెట్ 6-2, 6-1 తేడాతో రద్వాన్‌స్కాను చిత్తు చేసి నాలుగో రౌండ్‌కు దూసుకెళ్లింది. మరో మ్యాచ్‌లో డెన్మార్క్ క్రీడాకా రిణ వోజ్నియాకి విజయం సాధించింది. మూడు సెట్ల పోరులో వోజ్నియాకి 6-2, 2-6, 6-3 తేడాతో అమెరికా క్రీడాకారిణి బెలిస్‌ను ఓడించి ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది.

Comments

comments