Search
Monday 24 September 2018
  • :
  • :

ముస్లింల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం

We are committed to the development of Muslims

నిరుపేద విద్యార్థులకు మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలు
షాదీ ముబారక్‌తో తీరిన పెళ్లి కష్టాలు
రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాలశాఖ మంత్రి ఈటల రాజేందర్

మనతెలంగాణ/హుజూరాబాద్: రాష్ట్రంలో కనీవీని ఎరగని రీతిలోముస్లింలఅభివృద్ధి జరుగుతుందని, ముస్లింల సంక్షే మం కోసంప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. శుక్రవా రం పట్టణంలోని సాయిరూప గార్డెన్‌లో తెలంగాణ ప్రభు త్వం తరపున ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని నిర్వహించా రు. సందర్భంగా మంత్రి ఈటల రాజేందర్,ఎంపి వినోద్‌కుమార్‌తో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా ముస్లింసోదరులనుద్దేశించి ఆయన మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణకు తీరని అన్యాయం జరిగింద ని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వంఅధికారంలోకి వచ్చా క ముస్లిం సంక్షేమం కోసం ఎనలేని కృషి చేస్తుందన్నారు. విద్యార్థులకు మెరుగైన విద్యను అందించాలనే ఉద్దేశ్యంతో రాష్ట్ర వ్యాప్తంగా మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలను ఏ ర్పాటు చేసిందని పేర్కొన్నారు. కార్పొరేట్ స్థాయిలో విద్యార్థులకు మెరుగైన విద్యను అందించడం జరుగుతుందని తె లిపారు.ప్రతి విద్యార్థిపై రాష్ట్ర ప్రభుత్వం రూ. లక్ష 35 వేల నగదును ఖర్చు చేస్తుందని పేర్కొన్నారు. అంతేకాకుండా నిరుపేద కుటుంబాలకు చెందిన యువతుల వివాహానికి ఆర్థిక సహాయం అందించేందుకు షాదీముబారక్ పథకం తో రూ. లక్ష నగదును అందజేయడం జరగుతుందని తెలిపారు.రాష్ట్ర వ్యాప్తంగా ముస్లిం నిరుద్యోగుల సంక్షేమం కో సం ఉచితంగా కోచింగ్ సెంటర్ల ద్వారా ఉద్యోగులకు కో చింగ్ ఇప్పించడం జరుగుతుందని తెలిపారు.
అనంతరం ఎంపి వినోద్‌కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభు త్వం అందిస్తున్న సదుపాయాలను ముస్లిం సోదరులు స ద్వినియోగం చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని పే ర్కొన్నారు.ప్రతి సంవత్సరం ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం రంజాన్ కానుకగా దుస్తులను పంపిణీ చేస్తుందన్నారు. ఇఫ్తార్ విందు కార్యక్రమం మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఈ యేడు ముస్లిం సోదరులకు దుస్తుల పంపిణీ కార్యక్రమం జరుగుతుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ వడ్లూరి విజయ్‌కుమార్, మార్కెట్ చైర్మన్ ఎడవెల్లి కొండాల్‌రెడ్డి, టిఆర్‌ఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి బండ శ్రీనివాస్, తెలంగాణ ము స్లిం ఎంప్లాయూస్ యూనియన్ నాయకులు మహ్మద్ ము జాహిద్ హుస్సేన్,నాయకులు తాళ్లపల్లి శ్రీనివాస్, మురాద్ హుస్సేన్, గఫార్, ఇమ్రాన్ తదితరులు ఉన్నారు.

Comments

comments