Search
Sunday 18 November 2018
  • :
  • :
Latest News

ఎఫైర్ లేదు

nidhi

ఇండియన్ క్రికెటర్ కె.ఎల్.రాహుల్‌తో బాలీవుడ్ బ్యూటీ నిధి అగర్వాల్‌కు ఎఫైర్ ఉందనే వార్తలు గత కొంత కాలంగా వినిపిస్తున్నాయి. అయితే దీనిపై వాళ్లు స్పందించలేదు. కానీ చివరికి హీరోయిన్ నిధి అగర్వాల్… రాహుల్‌తో తన బంధంపై క్లారిటీ ఇచ్చింది. “నాది, రాహుల్‌ది ఒకే నగరం. చాలా కాలంగా మేమిద్దరం స్నేహితులం. నేను నటిగా, ఆయన క్రికెటర్‌గా మారినప్పటి నుంచి మా స్నేహం గురించి అందరికీ తెలిసిపోయింది. అయితే మా మధ్య ఎఫైర్ ఉందనే గాలి వార్తలు వినిపిస్తున్నాయి.  ఆ వార్తలు మా ఫ్రెండ్‌షిప్‌కు అడ్డం కాలేదు. మీడియాలో వస్తున్నట్టు మా మధ్య ఎఫైర్ లేదు”అని నిధి పేర్కొంది.నిధి అగర్వాల్.  ఇక ‘సవ్యసాచి’ చిత్రంతో నిధి తెలుగులోకి ప్రవేశించింది. ఈ చిత్రంలో నాగచైతన్య సరసన ఆమె నటిస్తోంది. అలాగే అక్కినేని అఖిల్‌తో ప్రస్తుతం మరో సినిమాలోనూ నిధి అగర్వాల్ నటిస్తోంది.

Comments

comments