Home పెద్దపల్లి మానేరు వాగుపై వంతెన నిర్మాణానికి కృషి

మానేరు వాగుపై వంతెన నిర్మాణానికి కృషి

spikar-image

అసెంబ్లీ స్పీకర్ మధుసూధనా చారి

మనతెలంగాణ/కాల్వశ్రీరాంపూర్: కాల్వశ్రీరాంపూర్ మండలం కిష్టంపేట్, జయశంకర్ భూ పాలపల్లి జిల్లా మండలం భూర్నపల్లి గ్రామాల మధ్యగల మా నేరు వాగుపై వంతెన నిర్మాణానికి కృషి చేస్తానని అసెంబ్లీ స్పీకర్ సిరికొండ మధు సూధనాచారి గ్రామస్థులకు హామీ ఇచ్చారు. భూపాలపల్లి జిల్లా మం డలం భూర్నపల్లిలో గురువారం రాత్రి స్పీకర్ పల్లె నిద్ర చేపట్టాడు. ఈ సందర్భంగా భూర్నపల్లి గ్రామస్థులు తమకు మానేరు అవతలివైపు ఉన్న కిష్టంపేట్, కాల్వశ్రీరాంపూర్ మండలంలోని పలు గ్రామాలకు సంబంధాలు ఉండడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని స్పీకర్ దృష్టికి తీసుకేళ్లార ని, అదేవిధంగా కిష్టంపేట గ్రామస్థులు సైతం పలుమార్లు బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని తన దృష్టికి తీసుకవచ్చారని స్పీకర్ తెలిపారు. ఈ సందర్భంగా భూర్నపల్ల్లి నుంచి కిష్టంపేటకు వచ్చి గ్రామస్థులతో మాట్లాడారు.అనంతరం మానేరు వా గుపై బ్రిడ్జి నిర్మాణం చేసే స్థలాన్ని పరిశీలించారు. ఈ బ్రిడ్జి నిర్మాణంతో రెండు జిల్లాల ప్రజలకు రవాణాకు సౌకర్యవంతంగా ఉంటుందని రెండు గ్రామాల ప్రజల కోరిక మేరకు బ్రిడ్జి నిర్మాణం కోసం సంబంధిత అధికారులతో త్వరలో సర్వే జరిపించి,ప్రతిపాదనలు పంపి మంజూరు చేయిస్తానన్నారు.