Search
Sunday 22 July 2018
  • :
  • :

జిల్లాలో పాలికేర్ సెంటర్ ఏర్పాటుకు సహకరిస్తాం

We assist the creation of the Palike Center in the district

జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్

మనతెలంగాణ/జగిత్యాల: జిల్లాలో పాలికేర్ సెంటర్ ఏర్పాటుకు జిల్లా యంత్రాంగం తరుఫున సహకరిస్తామని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ అన్నారు. గురువా రంపాలికేర్ సెంటర్ నిర్వాహకులుకలెక్టరేట్‌లోని చాంబర్లో జిల్లా కలెక్టర్‌ను కలిశారు. నిర్వాహకులు మా ట్లాడుతూ దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వా రికి సేవ చేయాలనే ఉద్దేశంతో రాష్ట్రంలో తమ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు వారు తెలిపారు.తెలంగా ణ వ్యాప్తంగా కేంద్రాల ఏర్పాటుకు సర్వే నిర్వహించినట్లు, 19వ కేంద్రం ఏర్పాటుకు జగిత్యాల జిల్లాలను ఎంచుకున్నట్టు వారు తెలిపారు. జిల్లాలో క్యాన్సర్, ప క్షవాతం, లాంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతు న్న వారికి ఈ కేంద్రం ద్వారా సేవలందించనున్నట్లు వారు తెలిపారు. వ్యాధిగ్రస్థులు చనిపోతున్నాం అనే భావన నుండి బయటకు తెచ్చి, వారికి మెరుగైన వై ద్యం అందిస్తామన్నారు. కేంద్రానికి 15 కిమీలోపు ఉ న్న వ్యాధి గ్రస్థులకు వారి ఇంటికెళ్లి వైద్య సేవలు అందించనున్నట్లు వారు తెలిపారు. కేంద్రం ఏర్పాటుకు జిల్లాలో అనువైన స్థలం కేటాయించాలని కలెక్టర్‌ను కోరారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కెసిఆర్ కిట్ లాంటి పథకాలు జిల్లాలో విజయవంతంగా అమలవుతుందని, 75శాతానికి పైగా ప్రసవాలు ప్ర భుత్వ ఆస్పత్రుల్లో జరుగుతున్నాయన్నారు. దీని కారణంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఖాళీలు లేవన్నారు. పాలికేర్ కేంద్రాన్ని ప్రస్తుతం తాత్కాలికంగా ధర్మపురిలో ఏర్పాటుకు ఒక హాల్‌ను కేటాయిస్తామన్నారు. వైద్యం కోసం వచ్చిన రోగులకు, కేవలం వైద్యం కొరకు మా త్రమే వచ్చినట్లు కాకుండా శ్రీ లక్ష్మీనృసింహ స్వామి దేవస్థానం, పుణ్య గోదావరి ఉండడం వల్ల భక్తిభావం పెంపొందుతుందన్నారు. కేంద్ర నిర్వాహకులకు అవసరమైన అన్ని మౌలిక వసతులు కల్పిస్తామన్నారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి మెరుగై న వైద్య సేవలు అందించడం చాలా మంచిదని, ఇం టికెళ్లి సేవ చేయడం కూడా బాగుందన్నారు. దీనిని వ్యాధి గ్రస్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మెట్‌పెల్లి సబ్ కలెక్టర్ గౌతమ్ పోట్రూ, ఇన్‌చార్జి జిల్లా వైద్యాధికారి డాక్టర్ జయపాల్‌రెడ్డి, ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ సదా మో హన్, పాలికేర్ కేంద్ర నిర్వాహకులు జగన్నాథ్, ప్రే మ, గుణరంజన్ తదితరులు పాల్గొన్నారు.

Comments

comments