Home రాష్ట్ర వార్తలు ప్రజల అండతోనే కడతాం

ప్రజల అండతోనే కడతాం

ప్రతిపక్షాలు నానా రాద్ధాంతం చేస్తున్నాయి: మల్లన్నసాగర్‌పై హరీశ్‌రావు

harish-raoహైదరాబాద్: ప్రజలను మెప్పించి, ఒప్పించి  మల్లన్నసాగర్ ప్రాజెక్ట్‌ను కచ్చితంగా నిర్మి స్తామని నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అన్నా రు. ప్రాజెక్ట్‌లను అడ్డుకోవడానికి ప్రతిపక్షాలు నానా రాద్ధాంతం చేస్తున్నాయని, కుట్రలు పన్నుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునేలా కోడిగుడ్డు మీద ఈకలు పీకేలా వ్యవహరిస్తున్నాయన్నా రు. మల్లన్నసాగర్ రైతులను ఒప్పించి భూములను సేక రిస్తామని, వారు కోరుకున్న పరిహారాన్నిచ్చి నిర్వాసితు లను టిఆర్‌ఎస్, కెసిఆర్ అభిమానులుగా మారేలా చేస్తా మని తెలిపారు. మెదక్ జిల్లా ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకుంటామన్నారు. తెలంగాణ భవన్‌లో మంగళ వారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులు కోరుకున్నట్లు పరిహారం చెల్లిస్తా మని ముఖ్యమంత్రి కెసిఆర్ హామీనిచ్చినా ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు. రైతులను రెచ్చ గొట్టి ప్రాజెక్టులకు భూములను ఇవ్వకుండా మభ్యపెడు తున్నారన్నారు. ప్రతిపక్షాల   అసలు రంగు బయటపడిందని,వారి మాయమాటలు తేలిపోయాయని, అందుకే రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి రిజిస్ట్రేషన్లు చేస్తున్నారని వివరి ంచారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పోతిరెడ్డిపాడు, పులిచింతల ప్రాజె క్టులను ఆపలేకపోయారని, ఆంద్రా ప్రాజెక్ట్‌లను పూర్తి చేసి, తెలంగాణ ప్రాజె క్టులను పట్టించుకోకుంటే అనాడు ఎందుకు నోరు మెదపలేదని ఆయన కాంగ్రెస్ నేతలను ప్రశ్నించారు. వారు చేసిన పాపాల వల్లనే ఎంతో మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. రాష్ట్రం పచ్చగా ఉండాలని సిఎం కెసిఆర్ రాత్రింబవళ్లు శ్రమించి, ప్రాజెక్టులను రీ డిజైనింగ్ చేసి కోటి ఎకరా
లకు నీళ్లు ఇవ్వాలని సంకల్పించారని ఆయన స్పష్టం చేశారు. మొదటి నుంచీ ప్రజలు ఒకవైపు ఉంటే ప్రతిపక్షాలు మాత్రం మరో వైపు ఉంటున్నాయని ఆరోపించారు.
వారిది అక్కడో మాట, ఇక్కడో మాట
కాంగ్రెస్, టిడిపి, సిపిఎం అధికారంలో ఉన్న చోట ఒక మాట, అధికారంలో లేని చోట మరో మాట మాట్లాడుతున్నారని, ఆ రెండు పార్టీలూ తోడు దొంగల్లా వ్యవహారిస్తున్నాయని మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. ఆంధ్రా రాజధాని కోసం 500 ఎకరాల సరిపోతాయని, కాని ఎపి ప్రభుత్వం 54 వేల ఎకరాలను రైతుల నుంచి బలవంతంగా లాక్కుంటుందుని, రెండు పంటలు పండే భూములను బడా బాబుల సేకరిస్తోందని విమర్శించారు. రాజధాని కోసం 54 వేల ఎకరాలు సేకరించడం ప్రపంచంలో ఎక్కడైనా ఉన్నదా ? అని ప్రశ్నించారు. గతంలో వాన్‌పిక్ కోసం 16వేల ఎకరాలను సేకరిస్తే టిడిపి రాద్ధాంతం చేసిందని, తాము అధికారంలోనికి వస్తే ఆ భూములను తిరిగి ఇస్తామని హామీనిచ్చిన టిడిపి అధికారంలోనికి రాగానే భూములను ఎందుకు తిరిగివ్వలేదో సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎపిలో టిడిపి ప్రభుత్వాన్ని ఒక్క మాట అనని కాంగ్రెస్‌పార్టీ, తెలంగాణలో మాత్రం ప్రభుత్వాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకుందన్నారు. దేశంలోనే అత్యధిక గ్రామాలు ముంపునకు గురయ్యే ప్రాజెక్టులను కర్నాటకలో కడుతున్నారని, దీనిపై కాంగ్రెస్ నేతలు ఏం చేబుతారని ప్రశ్నించారు. కాంగ్రెస్ హయాంలో పాలమూరులో 115 టిఎంసిలకు 32 గ్రామాలు, మిడ్‌మానేరులో 25 టిఎంసిలకు 18 గ్రామాలు, ఎల్లంపల్లిలో 20టిఎంసిలకు 21 గ్రామాలు ముంపునకు గురయ్యే విధంగా డిజైనింగ్ చేశారని ఆయన వివరించారు. సమైక్య పాలనలో ఒక్క ఎకరానికి కూడా నీరు ఇవ్వలేదని విమర్శించారు.