Home జాతీయ వార్తలు రాముని గుడి కట్టాల్సిందే: పేజావర్ పీఠాధిపతి

రాముని గుడి కట్టాల్సిందే: పేజావర్ పీఠాధిపతి

 Ram Mandir

 

బెంగళూరు: అయోధ్యలో రామ మందిరం నిర్మించేందుకు సుప్రీంకోర్టు తీర్పు కోసం తాము వేచి చూడలేమని పేజావర్ మఠం అధిపతి విశ్వేశ తీర్థ స్వామి అన్నారు. బుధవారం నరసింహరాజపుర సమీపంలోని సీతూరులోగల గోపాలకృష్ణుని ఆలయాన్ని సందర్శించిన సందర్భంగా విలేకరులతో స్వామీజీ మాట్లాడుతూ, అయోధ్యలో రామ మందిరం కట్టాలని హిందువులు డిమాండు చేస్తున్నారని, తాము కూడా ప్రధానమంత్రిని అదే విషయమై కోరతామని చెప్పారు.

అయోధ్యలో రామ మందిరం నిర్మాణం చేపట్టేందుకు వీలుగా ఒక ఆర్డినెన్స్ జారీచేయాలని ఆయన కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఆర్డినెన్స్‌ను తీసుకురావడం సాధ్యం కాని పక్షంలో ప్రభుత్వం చొరవ తీసుకుని రెండు మతాలకు చెందిన నాయకులతో సమావేశం ఏర్పాటు చేయాలి. ఉభయులకు ఆమోదయోగ్యమైన పరిష్కారం కనుగొని కోర్టు వెలుపల ఈ వివాదాన్ని పరిష్కరించుకోవాలి, అని స్వామీజీ సలహా ఇచ్చారు.

శబరిమల ఆలయంలో అన్ని వయసులకు చెందిన మహిళలకు ప్రవేశం కల్పిస్తూ సుప్రీంకోర్టు జారీ చేసిన తీర్పును విలేకరులు ప్రస్తావించగా, ఆలయాలకు సొంత పూజాదికాలు, సాంప్రదాయాలు ఉంటాయి. కృష్ణుడు, రాముడు, వినాయకుడి ఆలయాలలోకి మహిళ ప్రవేశానికి అనుమతి ఉంది. శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశంపై ఆ ఆలయ నియమాలు, సాంప్రదాయాల ప్రకారం ఆంక్షలు ఉన్నాయి. ప్రభుత్వం సాంప్రదాయాలను గౌరవించాల్సి ఉంటుంది, అని స్వామీజీ అభిప్రాయపడ్డారు.

We Can’t Wait SC Verdict on Ram Mandir, Pejawar Mutt Seer Says they cant wait for SC verdict on Ram Mandir in Ayodhya,Ram Mandir Cant Delayed