Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

తదుపరి రాష్ట్రపతి విషయంలో అమిత్ షా ఏమన్నారంటే..?

AMITSHAH

న్యూఢిల్లీ : ప్రస్తుత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పదవీ కాలం మరికొద్ది రోజుల్లో ముగియనుంది. ఈ నేపథ్యంలో తదుపరి రాష్ట్రపతిగా ఎవరిని ఎన్నుకుంటారనే విషయంపై సర్వత్ర చర్చ ప్రారంభమైంది. అయితే ప్రభుత్వం మాత్రం ఈ విషయంపై సస్పెన్స్ కొనసాగిస్తూనే ఉంది. ఎన్డిఎ ప్రభుత్వం రాష్ట్రపతిగా ఎవరిని ప్రకటించాలనే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని సమాచారం. రాష్ట్రపతి ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టేందుకు ప్రతిపక్షాలు ఇప్పటికే ప్రయత్నిస్తున్న నేపథ్యంలో బిజెపి జాతీయాధ్యక్షుడు అమిత్ షా తాజాగా ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సమాధానం ఇచ్చారు. రాష్ట్రపతి అభ్యర్థి ఎవరనే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఆయన తెలిపారు. ఈ విషయంపై ముందు పార్టీలో చర్చ జరగాలని, ఆ తర్వాతే అభ్యర్థిని ప్రకటిస్తామని అన్నారు.  ఆరెస్సెస్‌ చీఫ్‌ మోహన్ భగవత్‌ను రాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెట్టాలనే ప్రతిపాదనను ఇప్పటికే బిజెపి తిరస్కరించిన విషయాన్ని షా మరోసారి గుర్తుచేశారు.

Comments

comments