Search
Friday 21 September 2018
  • :
  • :
Latest News

డే నైట్ టెస్టుకు బిసిసిఐ విముఖత

crickt

ముంబయి: ఆస్ట్రేలియాలో జరిగే సిరీస్‌లో డే నైట్ టెస్టు ఆడే ప్రసక్తే లేదని భారత క్రికెట్ బోర్డు తేల్చి చెప్పింది. ఈ ఏడాది చివర్లో భారత జట్టు సుదీర్ఘ పర్యటన కోసం ఆస్ట్రేలియా వెళ్లనుంది. ఈ పర్యటనలో భారత్ నాలుగు టెస్టు మ్యాచ్‌లు ఆడనుం ది. అయితే ఇందులో ఒక టెస్టును డే నైట్ ఫార్మాట్‌లో నిర్వహించాలని క్రికెట్ ఆస్ట్రేలియా భావిస్తోంది. ఈ మేరకు భారత బోర్డును ఒప్పించేందు కు శతవిధాలుగా ప్రయత్నిస్తోంది. అయితే భా రత క్రికెట్ బోర్డు మాత్రం డే నైట్ టెస్టుపై ఆసక్తి క నబరచడం లేదు. ఈ పద్ధతో టెస్టు మ్యాచ్ ఆడేందుకు తాము సిద్ధంగా లేమని స్పష్టం చేసింది. ఈ మేరకు బిసిసిఐ క్రికెట్ ఆస్రేలియాకు ఓ లేఖ కూడా పంపించింది. కాగా, డే నైట్ టెస్టు మ్యాచ్ ఆడాలంటే ఎంతో సాధన అవసరమని, ఆస్ట్రేలియాతో జరిగే సిరీస్ నాటికి ఈ విధానానికి అలవాటు పడడం దాదాపు అసాధ్యమని భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ రవిశాస్త్రి ఇప్పటికే స్ప ష్టం చేశాడు. దాదాపు ఏడాదిన్నర పాటు సాధన చేస్తేనేగానీ ఈ ఫార్మాట్‌కు అలవాటు పడడం సాధ్యం కాదని రవిశాస్త్రి గతంలో బోర్డుకు తేల్చి చెప్పాడి. కాగా, భారత కెప్టెన్ కోహ్లి కూడా డేనైట్ టెస్టుపై అంతగా ఆసక్తి కనబరచడం లేదు. దీంతో రానున్న ఆస్ట్రేలియా సిరీస్‌లో కూడా భారత్ ఈ ఫార్మాట్‌లో టెస్టు ఆడడం లేదనే విషయం తేలి పోయింది.

Comments

comments