Search
Saturday 17 November 2018
  • :
  • :

శ్రీశాంత్‌పై నిషేధాన్ని ఎత్తివేయం!

  • హైకోర్టుకు విన్నవించిన బిసిసిఐ బోర్డు

Sreesanth

కోచి : భారత పేస్ బౌలర్ ఎస్. శ్రీశాంత్‌పై విధించిన జీవిత కాల నిషేధాన్ని ఎత్తివేసే ప్రసక్తే లేదని బిసిసిఐ (భారత క్రికెట్‌ని యంత్రణ మండలి) స్పష్టం చేసింది. ఈ మేరకు మంగళవా రం కేరళ హైకోర్టుకు బిసిసిఐ బోర్డు సమాచారం అందించింది. శ్రీశాంత్ పిటిషిన్‌పై విచారించిన కేరళ హైకోర్టు అతనిపై జీవితకాల నిషేధాన్ని ఎత్తి వేయాలని బిసిసిఐకి నోటీసులు పంపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీశాంత్ నిషే ధంపై కోర్టుకు బిసిసిఐ విన్నవించింది. 2013లో జరిగిన ఐపిఎల్ (ఇండియన్ ప్రీమియర్ లీగ్) 6 సీజన్‌లో భారత స్పీడ్‌స్టర్ శ్రీశాంత్ స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో అరెస్టు అయ్యాడు. దీంతో ఆ ఏడాది బిసిసిఐ బోర్డు అతనిపై జీవితకాల నిషేధాన్ని విధించింది. స్కాటిష్ క్లబ్ తరపున లీగ్ క్రికెట్ ఆడేందుకు ఒప్పందం కుదుర్చుకున్న శ్రీశాంత్.. గత జనవరిలో నిరభ్యంతర పత్రాన్ని (ఎన్‌ఒసి) కోరగా అందుకు బోర్డు తిరస్కరించింది. బిసిసి ఐ మాజీ పాలకుల కమిటీ నిర్ణయం మేరకు అప్పట్లో శ్రీశాంత్‌పై జీవితకాల నిషేధాన్ని విధించ డం జరగిందనీ, ప్రస్తుత నూతన బిసిసిఐ పాలకుల కమిటీ శ్రీశాంత్ నిషేధం విషయంలో నిర్ణయం తీసుకోలేదని కేరళ హైకోర్టుకు విన్నవించింది. 2015 జులైలో ఢిల్లీలోని స్పెషల్ కోర్టు శ్రీశాంత్‌పై మోపబడిన అభియోగాలను కొట్టివేస్తూ అతన్ని నిర్దోషిగా విడుదల చేసింది. ఆ తర్వాత స్థానిక టోర్నీలో ఆడేందుకు శ్రీశాంత్ ప్రయత్నించినప్పటికీ బిసిసిఐ తనపై విధించిన జీవితకాల నిషేధా న్ని ఎత్తివేయకుండా కొనసాగిస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో తనపై విధించిన జీవితకాల నిషేధాన్ని ఎత్తి వేయాలని శ్రీశాంత్ బిసిసిఐని అభ్యర్థించినప్పటికీ ఎలాంటి స్పందన లభించలేదు. దీంతో బిసిసిఐ నిషేధా న్ని సవాల్ చేస్తూ కేరళ హైకోర్టులో 34 ఏళ్ల స్పీడ్‌స్టర్ పిటిషిన్ దాఖలు చేశాడు. ఐపిఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసులో ఢిల్లీ కోర్టు నిర్దోషిగా ప్రకటించినప్పటికీ ఢిల్లీ పోలీసులు ఇచ్చిన సమాచారం ఆధా రంగానే బిసిసిఐ తనపై నిషేధాన్ని పొడిగిస్తూ వస్తోందని తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ విషయంలో బిసిసిఐ చర్యలు అసమంజసమైనవిగా తెలిపాడు. అంతేకాక సెక్షన్ 3 (ఎమ్‌సిఒసిఎ) మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్‌డ్ క్రైమ్ యాక్ట్) సహా అన్ని ఆరోపణలపై ట్రైయల్ కోర్టు క్లీన్‌చీట్ ఇచ్చిందని చెప్పాడు. ఈ నేపథ్యంలో శ్రీశాం త్ పిటిషిన్‌పై విచారించిన కేరళ హైకోర్టు వెంటనే అతనిపై ఉన్న జీవితకాల నిషేధాన్ని ఎత్తివేయాల్సిందిగా బిసిసిఐకి నోటీసులు పంపింది.

Comments

comments