Home తాజా వార్తలు దేవాదుల ఎత్తిపోతల నుంచి నీరిస్తాం : హరీష్

దేవాదుల ఎత్తిపోతల నుంచి నీరిస్తాం : హరీష్

HARISH1

హైదరాబాద్ : వచ్చే ఏడాది నుంచి దేవాదుల ఎత్తిపోతల నుంచి పూర్తిస్థాయిలో నీరిచ్చేందుకు కృషి చేస్తామని మంత్రి హరీష్‌రావు తెలిపారు. శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ ఏడాది ఒక్క జనగాం జిల్లాలోనే 102 చెరువులు నింపినట్లు ఆయన వెల్లడించారు. చెరువుల పూడికతీత, ప్రాజెక్టుల పూర్తికి తమ ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన చెప్పారు.