Search
Saturday 22 September 2018
  • :
  • :

కోటి ఎకరాలకు సాగునీరు అందిస్తాం

We provide irrigated water for crops

మన తెలంగాణ/హసన్‌పర్తి : తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి పంట పండించుకోవడానికి కోటి ఎకరాలకు సాగునీరు అందించుటకు సీఎం కేసిఆర్ కృత నిశ్చయంతో ముందుకు వెళ్తున్నారని వర్ధన్నపేట ఎంఎల్‌ఎ అరూరి రమేష్ అన్నారు. మంగళవారం 57వ డివిజన్ పరిధిలోని పలివేల్పుల 1కోటి 52లక్షల బ్రిడ్జీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత పాలకులు తెలంగాణ రాష్ట్రంలోని రైతాంగాన్ని పట్టించుకోకపోవడంతో సాగునీరు, తాగునీరు సరిపడ లేక వ్యవసాయం దిగుబడి లేక రైతులు, ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కొన్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటైన తరువాత గత నాలుగు సంవత్సరాలుగా రైతు సంక్షేమం కోసం మిషన్‌కాకతీయ పతకం ద్వారా చెరువు పూడికలు తీసి రైతులకు రెండు పంటలు పండే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుందని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ పూర్తైన తరువాత అందులో నుండి కరీంనగర్ మనేరు డ్యాం నీటిని తరలించి ఎస్‌ఆర్‌ఎస్‌పి కెనాల్ ద్వారా వర్ధన్నపేట నియోజకవర్గానికి లక్ష ఎకరాలకు నీరు అందించుటకు ప్రభుత్వం అన్ని విధాల ప్రణాళికలు వేశామన్నారు. అందులో భాగంగానే ఎస్‌ఆర్‌ఎస్‌పి కాలువల పునరుద్ధరణ పనులు, బ్రిడ్జి నిర్మాణ పనులు చేపట్టడం జరిగిందన్నారు. అదే విధంగా గ్రేటర్ వరంగల్ పరిధిలో విలీనమైన 31 గ్రామాలు అన్ని విధాలుగా అభివృద్ధి చెందుటకు కృషి చేస్తామన్నారు. పలివేల్పుల నుండి అవ్‌టర్ రింగ్‌రోడ్ వరకు సిసి రోడ్డు పనులు త్వరలో చేపడుతామని హామీ ఇచ్చారు. అదేవిధంగా కార్పోరేషన్ జనరల్ ఫంఢ్స్ నుండి, ఎంఎల్‌ఎ ఫంఢ్స్ నుండి పలివేల్పులలో చక్కటి సిటీ వాతావరణం అందిస్తామన్నారు.

Comments

comments