Home తాజా వార్తలు పరిశ్రమలను ఆదుకుంటాం : కెటిఆర్

పరిశ్రమలను ఆదుకుంటాం : కెటిఆర్

KTR

హైదరాబాద్ : చిన్న, సూక్ష్మ , మధ్యతరగతి పరిశ్రమలను ఆదుకుంటామని మంత్రి కెటిఆర్ తెలిపారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ఆయన మాట్లాడారు. చిన్న పారిశ్రామికవేత్తలను బ్యాంకులు చిన్నచూపు చూస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. చిన్న తరహా పరిశ్రమలకు పావలాశాతం వడ్డీతో రుణ సదుపాయం కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఖాయిలా పడుతున్న పరిశ్రమలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. ఖమ్మం జిల్లాలో పరిశ్రమల స్థాపన కోసం 106 ఎకరాలు కేటాయించామని వెల్లడించారు. పరిశ్రమలకు ఇచ్చిన భూములను సద్వినియోగం చేసుకోపోతే వెనక్కి తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.