Search
Wednesday 18 July 2018
  • :
  • :

పోటీలో కొనసాగుతాం: వొడాఫోన్ సిఇఒ

bs

న్యూఢిల్లీ:  భారత టెలికాం మార్కెట్‌లో ఐడియా సెల్యూలర్ కంపెనీతో విలీనం అయ్యాక పోటీలో కొనసాగుతాం అని బ్రిటన్ టెలికాం దిగ్గజం వొడాఫోన్ మంగళవారం తెలిపింది. భారత టెలికాం మార్కెట్‌లోకి కొత్తగా రిలయన్స్ జియో వచ్చాక అంతరాయాలు, కల్లోల పూరిత రే ట్ల యుద్ధం మొదలయింది. దాంతో వొడాఫోన్, ఐడియా తదితర టెలికాం సంస్థలు పోటీలో నిలబడ్డం కష్టంగా తయారయింది. టెలికాం మంత్రిత్వ శాఖలో ప్రముఖులతో సమావేశమయ్యాక వొడాఫోన్ సిఇఒ, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ నిక్ రీడ్ విలేకరులతో ‘ మేము పోటీలో కొనసాగుతాం’ అన్నారు. ఆయన మంగళవారం కమ్యూనికేషన్స్ మంత్రి మనోజ్ సిన్హా, కార్యదర్శి అరుణా సుందరరాజన్‌ను కలుసుకున్నారు.  ఐడియాతో వొడాఫోన్ విలీనానికి సంబంధించిన ఆమోద లేఖను పొందాక వారిని ఆయన కలిశారు. విలీనానికి సంబంధించిన ఆమోద లేఖ లభించిన విషయాన్ని రీడ్ ధ్రువీకరించారు. ‘లేఖ అందినందుకు మాకు సంతోషంగా ఉంది’ అని రీడ్ ఈ సందర్భంగా అన్నారు. విలీనం తర్వాత ‘వొడాఫోన్ ఐడియా లిమిటెడ్’గా ఆ రెండు సంస్థలు పేరును మార్చుకుంటున్నాయి. అప్పుల్లో ఉన్న వొడాఫోన్, ఐడి యా టెలికాం కంపెనీలు తమ కార్యకలాపాల ఖర్చును తగ్గించుకునే ప్రయత్నంలో  ఉన్నాయి. దేశంలోని అన్ని సర్కిళ్లలో 4జి స్పెక్ట్రంను వొడాఫోన్ ఐడియా లిమిటెడ్ అందించనున్నది. ఈ రెండింటి విలీనంతో భారత్‌లో అతిపెద్ద టెలికాం సంస్థ అన్న ట్యాగ్‌ను భారతి ఎయిర్‌టెల్ కోల్పోనున్నది. వొడాఫోన్ ఇండియా, ఐడియాల అప్పుల మొత్తం కలిపి  రూ. 1.15 లక్షల కోట్లు ఉంది. వొడాఫోన్ ఐడియా విలీన సంస్థలో వొడాఫోన్‌కు 45.1 శాతం వాటా, ఆదిత్య బిర్లా గ్రూపుకు 26 శాతం వాటా, ఐడియా వాటాదారులకు 28.9 శా తం వాటా ఉండనున్నది. విలీనం తర్వాత వొడాఫోన్ ఐడియా లిమిటెడ్‌కు బలేశ్ శర్మ కొత్త సిఇఒ కానున్నారు. కాగా ఐడియా చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ అక్షయ్ మూండ్ర ఆర్థిక వ్యవహారాల అధినేతగా ఉండనున్నారు. కాగా ప్రస్తుతం ఐడియా సెల్యూలర్‌కు డిప్యూటీ ఎండిగా ఉన్న అంబరీష్ జైన్ కొత్త చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ కానున్నారు.

Comments

comments