Home వనపర్తి యుద్ధ ప్రాతిపదికన ప్రాజెక్టులను పూర్తి చేస్తాం..

యుద్ధ ప్రాతిపదికన ప్రాజెక్టులను పూర్తి చేస్తాం..

harish3

* ఉమ్మడి పాలమూర్ జిల్లాలో 20 లక్షల ఎకరాల్లో కృష్ణమ్మ నీళ్లను పారిస్తాం..
* నిరంజన్‌రెడ్డి కృషితోనే వనపర్తి జిల్లా సస్యశ్యామలం..
* మంత్రులుగా కాకుండా ప్రజాసేవకులుగా నిరంతరం పని చేస్తున్నాం..
* మేఘారెడ్డి పని తీరు అభినందనీయం..
* పెద్దమందడి బ్రాంచ్ కెనాల్‌కు సాగునీటిని విడుదల చేసిన
రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖా మంత్రి హరీశ్‌రావు..

మన తెలంగాణ/వనపర్తి ప్రతినిధి : టిఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో మెరుపు వేగంగా యుద్దప్రాతిపాదికన ప్రాజెక్టులను పూర్తి చేస్తున్నామని రాష్ట్ర భారీ నీ టిపారుదల శాఖా మంత్రి హరీష్‌రావు తెలిపారు. గురువారం రాత్రి రాష్ట్ర ప్ర ణాళికా సంఘం ఉపాధ్యక్షులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, స్థానిక ఎంఎల్‌ఎ జి.చి న్నారెడ్డితో కలిసి పెద్దమందడి బ్రాంచ్‌కెనాల్‌కు బుద్దారం చెరువు నుండి నీటి ని విడుదల చేశారు. అనంతరం నిరంజన్‌రెడ్డి ఆధ్వర్యంలో బలిజపల్లి జంగ మాయపల్లి ఈర్లచెరువు దగ్గర ఏర్పాటుచేసిన టిఆర్‌ఎస్ బహిరంగ సభలో మంత్రి మాట్లాడుతూ ఉమ్మడి పాలమూర్ జిల్లాలోని నాల్గు పెండింగ్ ప్రాజె క్టులను పూర్తిచేసి పది లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వగలిగామని కల్వకు ర్తి,తుమ్మిళ్ల ప్రాజెక్టులను కూడా యుద్దప్రాతిపాదికన పూర్తి చేసి మరో పది లక్షల ఎకరాల చొప్పున మొత్తం ఇరవై లక్షల ఎకరాలకు ఉమ్మడి పాలమూర్ జిల్లాలో కృష్ణమ్మ నీళ్లను పారించి రైతుల పొలాల్లో సిరుల పంటలు కళ్ల చూ స్తామని ఆయన తెలిపారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని సాగునీ టి ప్రాజెక్టుల నిర్మాణాలను చూసి జీర్ణించుకోలేని కాంగ్రెస్ నాయకులు ప్రజ లను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. ప్రాజెక్టుల్లోకి నీళ్లు రావడా న్ని చూసి కాంగ్రెసోళ్లకు కన్నీళ్లు వస్తున్నాయని శాశ్వతంగా రాజకీయ జీవి తం కాంగ్రెసోళ్లకు ఫుల్‌స్టాఫ్ కానుందని మంత్రి ఎద్దేవ చేశారు. వనపర్తి జిల్లా లో ఇంత పెద్ద ఎత్తున సాగునీరు తేవడం నిరంజన్‌రెడ్డి కృషి వల్లే ఇది సాధ్య మైందని ఓటమి పాలైన నాయకులు నియోజక వర్గాన్ని విస్మరించడం చూశా మని ప్రజలకోసం పని చేసే నాయకుడు ఒక నిరంజన్‌రెడ్డియే నని గత ప్రభు త్వంలో ఎంఎల్‌ఎలుగా మంత్రులుగా పని చేసిన వారు నియోజక వర్గంలోని ఒక ఎకారాకు సాగునీరు అందించిన పాపాన పోలేదన్నారు. టిఆర్‌ఎస్ ప్రభు త్వంలోని మంత్రులు ఏనాడు కూడా తాము మంత్రులం అనే భావనతో పని చేయడం లేదని ప్రజా సేవకులుగా పని చేస్తున్నామని ఆయన తెలిపారు. నిరంతరం రాత్రింబవళ్లు ప్రాజెక్టుల దగ్గర నులక మంచాలపై పడుకొని ప్రాజె క్టులను పూర్తి చేసి ఏళ్ల తరబడి సాగునీటికి నోచుకోని రైతుల పొలాలకు సాగు నీరందిస్తున్నామన్నారు.
మేఘారెడ్డి పని తీరు అభినందనీయం..
జనవరి 29వ తేదీన పెద్దమందడి బ్రాంచ్ కెనాల్‌కు భూమిపూజ చేయగా భూసేకరణ సర్వేకు పది రోజుల సమయం తీసుకోవడం జరిగిందని ,ఫిబ్రవరి 10వతేదీన పనులు ప్రారంభం కాగా కేవలం 45 రోజుల వ్యవధిలోనే 4.2 కిలోమీటర్ల మెరుపు వేగంతో పనులను పూర్తి చేసి దాదాపు పది చెరువులకు సాగునీరందించే విధంగా పనులను చేపట్టిన పెద్దమందడి మండల టిఆర్‌ఎస్ అధ్యక్షులు , కాంట్రాక్టర్ మేఘారెడ్డి పని తీరు అభినందనీయమని మంత్రి కొనియాడారు. తన స్వంత మండలానికి సాగునీరందించేందుకు ఆయన చేసిన ప్రయత్నానికి మంత్రి అభినందించారు. కార్యక్రమానికి సభాధ్యక్షత వహించిన నిరంజన్‌రెడ్డి , మంత్రి జూపల్లి కృష్ణారావు, సాగునీటి రంగంపై గత ప్రభుత్వాలు ప్రదర్శించిన నిర్లక్ష్యాన్ని ప్రజలకు తమ ప్రసంగాల ద్వారా వివరించారు. దాదాపు 8 వేల నుండి 10వేల మంది దాకా రైతులు ,ప్రజలు విశేషంగా స్వచ్చంధంగా బహిరంగ సభకు తరలిరావడంతో టిఆర్‌ఎస్ నాయ కుల్లో నూతనఉత్సాహం కన్పించింది. కార్యక్రమంలో ఎంఎల్‌ఎలు ఆల వెంక టేశ్వర్‌రెడ్డి, మర్రి జనార్ధన్‌రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఎంఎల్‌సి కసిరెడ్డి నారా యణరెడ్డి, జడ్పి చైర్మన్ బండారి భాస్కర్, టిఎంయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అశ్వథ్థామారెడ్డి, నాయకులు మేఘారెడ్డి, జగదీశ్వర్‌రెడ్డి, పురుషోత్తం రెడ్డి, వివిధ మండలాల ఎంపిపిలు, జడ్పిటిసిలు, పాల్గొన్నారు.