Search
Sunday 18 November 2018
  • :
  • :
Latest News

మిషన్ భగీరథ పూర్తి చేస్తాం : కెసిఆర్

KCR23హైదరాబాద్ : ఆరునూరైనా మిషన్ భగీరథను పూర్తి చేసి తీరుతామని తెలంగాణ సిఎం కెసిఆర్ స్పష్టం చేశారు. శాసనసభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చకు కెసిఆర్ సమాధానమిచ్చారు. 2016 డిసెంబరు నాటికి 6,182 గ్రామాలు, 12 పురపాలక సంఘాలకు నీరందించి చూపిస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలో శాశ్వతంగా తాగునీటి సమస్య పరిష్కారం కోసమే మిషన్ భగీరథ అని ఆయన వెల్లడించారు. అభివృద్ధిని అడ్డుకోవడమే మీరు అనుసరించే నీతా అని ప్రశ్నించారు. పంచాయతీరాజ్ శాఖకు అతి ఎక్కువగా నిధులు కేటాయించిన ప్రభుత్వ తమదని ప్రకటించారు. సీఎం ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి. సంక్షేమానికి అగ్రతాంబూలం వేసినట్టు కెసిఆర్ తెలిపారు. కాంగ్రెస్ హయాంలో రూ.200 పింఛను ఇస్తే , తాము వెయ్యి ఇస్తున్నామని చెప్పారు. కాంగ్రెస్ హయాంలో 29లక్షల మందికి పింఛన్లు ఇస్తే, తమ హయాంలో ప్రభుత్వం 35.7లక్షల మందికి పింఛన్లు ఇస్తుందని , బీడీ కార్మికులకు వెయ్యి రూపాయలు జీవన భృతిగా ఇస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. విద్యార్థులకు సన్నబియ్యం తో అన్నం పెడుతున్నామని కెసిఆర్ తెలిపారు. వచ్చే సంవత్సరం నుంచి కాలేజీలు, యూనివర్సిటీ హాస్టళ్లలో కూడా సన్నబియ్యంతో అన్నం పెడుతామని కెసిఆర్ స్పష్టం చేశారు.

Comments

comments