Home రాష్ట్ర వార్తలు పెండింగ్ పూర్తిచేస్తాం

పెండింగ్ పూర్తిచేస్తాం

అసంపూర్తి ప్రాజెక్టులను గట్టెక్కించి మహబూబ్‌నగర్ జిల్లాలో 8 లక్షల ఎకరాలకు నీరందిస్తాం: నెట్టెంపాడు ట్రయల్న్‌ల్రో హరీశ్‌రావు

harish-raoగద్వాల: మహబూబ్ నగర్ జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులు కల్వకుర్తి, నెట్టెంపాడు, బీమా, కోయిల్ సాగర్ ప్రాజెక్టులను పూర్తి చేసి వచ్చే ఖరీఫ్ నాటికి 8 లక్షల ఎకరాలకు సాగు నీరందించనున్నట్లు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు వెల్లడిం చారు. గురువారం ధరూర్ మండలం లోని ర్యాలంపాడు గ్రామం వద్ద జవహర్ నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం స్టేజ్-2 పైలాన్ ఆవిష్కరించిన అనంతరం ట్రయల్న్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి హరీశ్‌రావు మాట్లాడు తూ కృష్ణానది ఎగువ ప్రాజెక్టులైన ఆల్మట్టి, నారా యణపూర్ డ్యాంల నుంచి నీరు విడుదలైనందు వల్ల జూరాల ద్వారా నెట్టెంపాడుకు వరదనీటితో రిజర్వాయర్లు నింపే ప్రయత్నం చేస్తున్నా మన్నారు. నెట్టెంపాడు ఫేజ్-2 కింద లక్ష15వేల ఎకరాలకు సాగునీ రందిస్తామన్నారు. అలాగే జిల్లాలో కల్వకుర్తి, బీమా, నెట్టెంపాడు, కో యిల్ సాగర్ ప్రాజెక్టుల ద్వారా సాగునీరు విడుదల చేసినట్లు చెప్పారు. వరదనీరు వచ్చి చేరడంతో ట్రయల్న్ ప్రారంభించి నీటిని విడుదల చే యాలని ముఖ్యమంత్రి ఆదేశించారన్నారు. తెలంగాణ వచ్చిన రెండు సంవత్సరాలలోనే రూ.2300కోట్ల నిధులతో పెండింగ్ ప్రాజెక్టులు పూ ర్తి చేయనున్నట్లు చెప్పారు. గత ప్రభుత్వాలు మూడు ఎకరాలకు కూ డా సాగునీరందివ్వలేదన్నారు. రాష్ట్రంలో కోటి ఎక రాలకు సాగునీరు అందించాలనే ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి పనిచేస్తు న్నారని చెప్పారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పనులు చేపట్టి మరో 20లక్షల ఎక రాలకు సాగునీరందించేందుకు చర్యలు తీసుకుం టున్నట్లు పేర్కొన్నా రు. 99 ప్యాకేజీ పనులను త్వరలో పూర్తి చేస్తామ న్నారు. అలాగే తు మ్మల ఎత్తిపోతల పథకం పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తార ని వెల్లడించారు. కృష్ణ జలాలపై సుప్రీం తీర్పు తెలంగాణకు అనుకూ లంగా ఉందన్నారు. కృష్ణ జలాలపై పాలమూ రుకే హక్కు ఉందన్నా రు. ముంపు గ్రామాల ప్రజలు సహకరించాలని ఏవైనా చిన్న చిన్న స మస్యలుంటే అన్యాయం జరగకుండా పరిష్కరిస్తా మని హామీ ఇచ్చారు.
వచ్చే వేసవినాటికి ఇంటింటికి తాగునీరు
మిషన్ భగీరథ ద్వారా రాష్ట్రంలోని ఇంటింటికి స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి హరీశ్‌రావు తెలిపారు. డిసెంబర్ నాటికి పనులు పూర్తి చేసి వచ్చే వేసవినాటికి ఇం టింటికి తాగునీరు అందిస్తామన్నారు. ప్రజల కోరిక మేరకు గుర్రంగడ్డ వంతెన ఏర్పాటు చేయడానికి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని ఆయ న చెప్పారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్, గ్రామాభివృద్ధిశాఖ జూపల్లికృష్ణారావు, వైద్య ఆరోగ్యశాఖమంత్రి లకా్ష్మరెడ్డి, ప్రణాళిక సం ఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి, జడ్‌పి చైర్మన్ బండారి భాస్కర్, ఎంపి జితేందర్‌రెడ్డి, ఎంఎల్‌ఎ శ్రీనివాస్‌గౌడ్, జిల్లా కలెక్టర్ టికె శ్రీదేవి, జెసి రాంకిషన్, ప్రత్యేక భూసేకరణ అధికారి వనజాదేవి, ఆర్‌డిఒ అబ్దుల్ హమీద్, ఎంపిపిలు, జడ్‌పిటిసిలు తదితరులు పాల్గొన్నారు.