Search
Tuesday 18 September 2018
  • :
  • :
Latest News

ట్రోఫీ మాదే!

  • విరాట్ కోహ్లి

Virat-Kohli

న్యూఢిల్లీ: ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్‌ను నిలబెట్టుకుంటామని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి జోస్యం చెప్పాడు. ప్రతి ష్టాత్మకమైన ఈ కప్‌ను తిరిగి గెలుచుకుంటామనే నమ్మకాన్ని కోహ్లి వ్యక్తం చేశాడు. బుధవారం ఛాంపియన్స్ ట్రోఫీ కోసం టీమిండియా ఇంగ్లాండ్ బయలుదేరింది. ఈ సందర్భంగా కోహ్లి మీడియా సమావేశంలో మాట్లాడాడు. కిందటిసారి విజేతగా నిలిచిన తమకు ఈసారి కప్పు గెలవడం కష్టమేమి కాదన్నాడు. అయితే దీని కోసం సర్వం ఒడ్డక తప్పదన్నాడు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో తమ జట్టు చాలా బలంగా ఉందన్నాడు. సమష్టిగా పోరాడితే ట్రోఫీని నిలబెట్టు కోవడం ఖాయమన్నాడు.

యువీ, ధోనీ కీలకం..

ఛాంపియన్స్ ట్రోఫీలో సీనియర్లు యువరాజ్ సింగ్, మ హేంద్ర సింగ్ ధోనీ సేవలు జట్టుకు చాలా కీలకమన్నాడు. వీరద్దరిపై జట్టు భారీ ఆశలు పెట్టుకుందన్నాడు. ఒత్తిడిని తట్టుకుని ముందుకు సాగే తత్వం వీరిలో ఉందన్నాడు. జట్టులో వీరి పాత్ర చాలా ముఖ్యమన్నాడు. ఒంటి చేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా ఈ దిగ్గజాలకు ఉందన్నాడు. వీరి సేవలను చక్కగా ఉపయోగించుకుం టానని కోహ్లి తెలిపాడు. ఇక, బౌలింగ్‌లో తమకు తిరుగులే దన్నాడు. బుమ్రా, భువనేశ్వర్, ఉమేశ్‌లతో కూడి బౌలింగ్ లైనప్ ఇంగ్లాండ్ గడ్డపై ప్రకంపనలు సృష్టించడం ఖాయమ న్నాడు. ఐపిఎల్‌లో సత్తా చాటిన ఈ త్రయం ఇక్కడ కూడా విజృంభిస్తుందనే నమ్మకాన్ని కోహ్లి వ్యక్తం చేశాడు. మరోవైపు అశ్విన్, జడేజా, హార్ధిక్ పాండ్యాల రూపంలో తమకు అగ్రశ్రేణి ఆల్‌రౌండర్లు అందుబాటులో ఉన్నార న్నాడు. దీంతో తాము ప్రతి మ్యాచ్‌లో గెలిచి ట్రోఫీని నిలబెట్టుకోవడం ఖాయమని కోహ్లి జోస్యం చెప్పాడు.

పాక్‌ను ఓడిస్తాం…

చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్ తమకు చాలా కీలకమన్నాడు. ఈ మ్యాచ్‌లో గెలుస్తామనే నమ్మకం తనకుందన్నాడు. గతంలో చాలా మ్యాచుల్లో పాక్‌ను ఓడించిన తమకు ఈసారి కూడా విజయం తథ్యమన్నాడు. అయితే ఛాంపియన్స్ ట్రోఫీ వంటి మెగా టోర్నమెంట్‌లో పోటీ తీవ్రంగా ఉంటుందన్నాడు. అయితే తమ దృష్టంతా గెలుపుపైనే ఉంటుందన్నాడు. పాక్‌ను ఓడించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తామన్నాడు. టోర్నీలోనే ఈ మ్యాచ్‌కు ఎనలేని ప్రాధాన్యత నెలకొందన్నాడు. దీంతో తీవ్ర ఒత్తిడి మధ్య మ్యాచ్ సాగుతుం దన్నాడు. ఇందులో ఓడితే అభిమానులు తట్టుకోలేరన్నాడు. అయితే తమకు పాక్‌తో పాటు ప్రతి మ్యాచ్ కీలకమన్నాడు. టోర్నీలో ముందుకు పోవాలంటే లీగ్ స్థాయిలో అన్ని మ్యాచుల్లో గెలవక తప్పదని కోహ్లి స్పష్టం చేశాడు. సౌతాఫ్రికా, శ్రీలంక జట్లను కూడా తేలిగ్గా తీసుకోలేమన్నాడు. వన్డేల్లో రెండు జట్లు చాలా పటిష్టమైనవని అన్నాడు. తాము మాత్రం ప్రతి మ్యాచ్‌లో గెలవడమే లక్షంగా పెట్టుకున్నామని వివరించాడు. ఒక్క మ్యాచ్‌లోనూ ఓడకుండా కప్పును గెలుచుకునేందుకు ప్రయత్ని స్తామన్నాడు. ఇది, కాస్త క్లిష్లమే అయినప్పటికీ అసాధ్యమేమి కాదని కోహ్లి స్పష్టం చేశాడు.

Comments

comments