Home లైఫ్ స్టైల్ వయసుకు వన్నెతెచ్చే నగలు…

వయసుకు వన్నెతెచ్చే నగలు…

Jewelry

 

వయసుకు తగ్గట్టు కట్టూబొట్టు ఉంటే ముచ్చటగా కనిపిస్తారు. ఏవయసువారు ఎటువంటి నగలు ధరించాలో చెబుతున్నారు సౌందర్య నిపుణులు. ఏ వేడుకకు, ఎలాంటి అలంకరణ అవసరమో, ఏ వయసుకు ఎలాంటి ఆభరణాలు బాగుంటాయో తెలుసుకుంటే సగం సమస్య తీరినట్టే.

* నుంచి 14 ఏళ్ల లోపు పిల్లలకు పట్టు లంగాలు అందాన్నిస్తాయి. ఈ డ్రస్సుకు మ్యాచ్ అయ్యేలా మెడకు దగ్గరగా కంఠి రకం నెక్లెస్ పెట్టాలి. నెక్లెస్ బదులుగా పొడవాటి హారం కూడా వేసుకోవచ్చు. నడుముకు వడ్డాణంతో అలంకరణ పూర్తి అయినట్లే.

* 15 నుంచి 26 ఏళ్ల మధ్య వయస్కులు పేస్టెల్స్, లాంగ్ ఫ్రాక్స్ వేసుకుంటారు కాబట్టి లాంగ్ ఇయర్ రింగ్స్, ముత్యాల చోకర్ ధరించాలి. చోకర్‌లో అన్‌కట్ డైమండ్ పెండెంట్ ఉంటే మరింత అందంగా ఉంటారు.

* 30 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్కులకు బెనారస్ చీరలు నప్పుతాయి. పగలైనా, రాత్రైనా ఏ వేళలో జరిగే వేడుక అయినా వీరికి ఈ దుస్తులు అందంగా ఉంటాయి. హెవీ జుంకాలు, పోల్కీ, కుందన్ లేదా డైమండ్‌లో హెవీ నెక్లెస్‌లు నప్పుతాయి. సాదా బంగారంలో అరుదైన డిజైన్లు కలిగి ఉండే నగలు ఎంచుకోవాలి.

* 40 ఏళ్ల వయసు స్త్రీలకు ఎలాంటి చీరలైనా నప్పుతాయి. పగటి వేళ వేడుకలకు పట్టు చీరలు కట్టుకోవచ్చు. చీరకు మ్యాచింగ్‌గా పూర్తి బంగారం లేదా గోల్డ్ అన్‌కట్ డైమండ్ నగలు ధరించాలి. ఇది పగటివేళ వేడుకలకు తగిన అలంకరణ. ఇక రాత్రివేళ లేత రంగు జార్జెట్, షిఫాన్ చీరలే బాగుంటాయి. కాబట్టి ముత్యాలు, డైమండ్స్ బాగుంటాయి. చెవులకు పెద్ద స్టడ్స్ పెట్టుకోవాలి. అలాగే నగల అలంకరణ సింపుల్‌గా ఉండాలి. పుట్టిన రోజులు, రిసెప్షన్లు, సంగీత్ మొదలైన వేడుకలకు ఇదే తాజా జ్యువెలరీ ట్రెండ్!

* 50 ఏళ్లు పైబడిన పెద్ద వారికి పట్టు చీరలు హుందాగా ఉంటాయి. మెడలో నాన్‌తాడు, డైమండ్ నెక్లెస్ లేదా నక్షి నెక్లెస్ కూడా వేసుకోవచ్చు. జడ బిళ్లల ఫ్యాషన్ కూడా నడుస్తోంది. ఇలా తయారైతే సెంటరాఫ్ ఎట్రాక్షన్ మీరే.

Wear Jewelry to Suit your Age