Home తాజా వార్తలు తెలంగాణకు వర్ష సూచన

తెలంగాణకు వర్ష సూచన

Weather Forecast Rainfall in 48 Hours in Telangana

హైదరాబాద్: క్యూములోనింబస్ మేఘాల ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈదురుగాలుతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ పేర్కొంది. అత్యధిక ఉష్ణోగ్రతల కారణంగా పగలు మేఘాలు ఏర్పడి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రానున్న రెండురోజుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పలుప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు.