Search
Wednesday 14 November 2018
  • :
  • :
Latest News

పెన్షన్ రాదనే బెంగతో నేత కార్మికుడి మృతి

tg breaking newsకరీంనగర్: సిరిసిల్ల బివై నగర్‌కు చెందిన చేరాల యాదగిరి(60) అనే నేత కార్మికుడు గత 7 నెలలుగా నేత కార్మిక ఆసరా పెన్షన్ పొందుతున్నాడు. ఈ నేపథ్యంలో గత 3 నెలల నుండి పెన్షన్ లిస్టులో పేరు లేదని పెన్షన్ నిలిపివేశారు. వచ్చే 35 కిలోల బియ్యం పథకాన్ని ఆహార భద్రత కింద 12కిలోలు చేయడం, పెన్షన్ నిలపివేయడంతో ఆవేదన చెందిన యాదగిరి గుండెపోటుతో మరణించాడు. అధికారులు విచారణ జరిపించి యాదగిరి పెన్షన్‌ను అతడి భార్యకు ఇప్పించాలని, అంత్యోదయ కార్డు ద్వారా 35 కిలోల బియ్యం అందించాలని సిపిఐ నాయకులు సామల మల్లేశం, పోలు కొమురయ్య, ఎలిగేటి రాజశేఖర్ కోరారు.

Comments

comments