Home ఫీచర్స్ తగ్గాలంటే ఇవి తినండి..!

తగ్గాలంటే ఇవి తినండి..!

 foods

 

బరువు తగ్గాలనుకునేవారికి కూరగాయలు, ముఖ్యంగా మొలకెత్తిన పప్పు ధాన్యాలు చాలా మేలు చేస్తాయి. రోజువారీ ఆహారంలో వీటిని తప్పనిసరి భాగంగా చేసుకొనేవాళ్ళు కూడా అనేక మంది ఉంటారు. అయితే, తినాలని ఉన్నా పెద్దగా రుచి ఉండదని చాలా మంది ఇష్టపడరు. మరికొన్ని పదార్థాల్ని జోడిస్తే తినడానికి ఇవి చాలా రుచిగా ఉండడమే కాదు, మరిన్ని పోషకాలను కూడా అందిస్తాయి. మరి అలాంటి ఒక రెసిపీ చూద్దామా…

పెసర మొలకల సలాడ్:
కావలసిన పదార్థాలు: మొలకెత్తిన పెసలు- రెండు కప్పులు, తురిమిన ఉల్లిపాయ- 1, తురిమిన టమాటా- 1, తురిమిన పచ్చి మిరపకాయ- 1, ఉడికించిన ఆలు గడ్డ 1
(చిన్న ముక్కలుగా తరగాలి), తురిమిన కొత్తిమీర- 1 స్పూన్, కారం పొడి- పావు స్పూన్, ఉప్పు – రుచికి తగినట్టు, ఛాట్ మసాలా- అర స్పూన్
నిమ్మ రసం- ఒక స్పూన్
చేసే పద్ధతి: ముందుగా నానబెట్టిన, మొలకలు వచ్చిన పెసలు బాగా కడగాలి. అవి మెత్తబడేవరకూ ఉడకబెట్టాలి. నీళ్ళను వార్చాలి. మొలకల్ని ఆరబెట్టాలి. అవి చల్లబడిన తరువాత తురిమిన ఉల్లిపాయ, పచ్చి మిరపకాయ, టమాటా, బంగాళదుంపలు, కొత్తిమీర వేసి బాగా కలపాలి. ఉప్పు, నిమ్మ రసం, కారం పొడి, ఛాట్ మసాలా వేసి, మరోసారి బాగా కలపాలి. తాజాగా ఉండగానే తింటే రుచికి రుచీ, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఈ సలాడ్ తినడం వల్ల శరీరానికి పోషకాలు అందిస్తూనే బరువు తగ్గవచ్చని చెబుతున్నారు.

Weight loss foods