Search
Tuesday 20 November 2018
  • :
  • :
Latest News

బరువు… బాధలు

weight

*ప్రమాదకరంగా అధిక బరువు, స్థూలకాయం
*రెండేళ్ళకే మానసిక సమస్యలు, బిపి, షుగర్
*విద్యార్థుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం
*ప్రైవేటు సంస్థ తాజా అధ్యయనంలో వెల్లడి

మన తెలంగాణ / హైదరాబాద్ : రాష్ట్రంలో ప్రతి ముగ్గురు విద్యార్థుల్లో ఒకరు అనారోగ్య సమస్యతో బాధపడుతున్నట్లు ‘ఛాయిస్ ఫౌండేషన్’, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ది ఎంపర్‌మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ ఇంటలెక్చువల్ బిజెబులిటి (ఎన్‌ఐ ఈపిఐడి), ఎల్వీ ప్రసాద్ నేత్ర ఆసుప్రతి సంయుక్తంగా ఇటీవల నిర్వహించిన ఒక సర్వేలో తేలింది.18 ఏళ్లలోపు పిల్ల లు బీపీ, మధుమేహం, అంధత్వం, దంత సంబంధ సమస్యలతో బాధపడుతున్నట్లు తేలింది. వెయ్యి మంది విద్యార్థులను సర్వే చేయగా 10 మంది బీపీ, 7 గురు మధుమేహం, 251 మంది కంటి, 40 మంది వినికిడి, 30 మంది ఇతర వ్యాధులతో బాధపడుతున్నట్లు తేలిందని, సంస్థకు చెందిన పిల్లల వైద్యుడు డాక్టర్ సతీష్ పేర్కొన్నారు. 5 ఏళ్లలోపు చిన్నారుల్లో 2.3 శాతం మంది ఊబకాయం,5 ఏళ్ళు దాటి న విద్యార్థుల్లో 31 శాతం మంది బాధపడుతున్నట్లు తేలిందని పేర్కొన్నారు. అతి చిన్న వయస్సులో వచ్చే వ్యాధు లు 20 ఏళ్ల నాటికి తీవ్ర ప్రమాదకరంగా మారే పరిస్థితి ఉంద ని, చదువులో ఒత్తిడి, టీవీ చూడడం, కంప్యూటర్లు వినియోగించడం, జంక్ ఫుడ్స్ తీసుకోవడం, జీవనశైలి తదితరాలన్నీ ఈ వ్యాధులకు కారణమవుతున్నాయని ఆయన తెలిపారు. చిన్న పిల్లల్లో మానసిక సమస్యలు కూడా ఎక్కువైతున్నట్లు సర్వేలో పాల్గొన్న సైకాలజిస్టు తెలిపారు.చర్మ సం బంధ అలర్జీ, పోషకాహార లోపం, ట్రాన్సిల్, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఈ సర్వే లో తేలిందని పేర్కొన్నారు.గతంలో 25 శాతం మంది అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటుండగా ఇప్పుడు అది 49 శాతానికి చేరిందని పేర్కొన్నారు.పిల్లల ఆరోగ్య విషయంలో తల్లిదండ్రులు, టీచర్లకు అవగాహన కల్పించాల్సిన అవసరముందని పిడియాట్రిక్ డాక్టర్ సతీష్ తెలిపారు. పిల్లలను వ్యాధులను ఎవరూ గుర్తించలేని పరిస్థితి ఉందని, అన్ని పాఠశాలల్లో పరీక్షలు నిర్వహించి ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు.భార్యభర్తలిద్దరూ ఉద్యోగాలు చేయాల్సిన అనివార్యతతో పిల్లలపై వెచ్చించే సమ యం తగ్గుతోందని, మెరుగైన చదువుకోసం ప్రముఖ పాఠశాలలో చేర్పిస్తున్నారని, ట్యూషన్ పేరుతో విద్యార్థులు తీవ్రమైన మానసిక ఒత్తిడి పడుతోందని పేర్కొన్నారు. ఆటపాట తో పాటు వారిలోని సృజనాత్మకతను వెలికితీయడం తగ్గిపోయిందని, చదువు, ర్యాంకు, ఇంగ్లీష్ ప్రావీణ్యంపై మాత్రమే ఎక్కువ దృష్టి సారిస్తున్నారని గుర్తుచేశారు. ఉపాధ్యాయులు సైతం పిల్లల ఆరోగ్య పరిస్థితిని అంచనా వేయలేకపోతున్నారని, చిన్న వయస్సులోనే వ్యాధుల బారిన పడుతున్నారని పేర్కొన్నారు.

Comments

comments