Search
Saturday 17 November 2018
  • :
  • :
Latest News

ప్రేమ వివాహంతో నూతన సంవత్సరానికి స్వాగతం

Love-marriage

కాటారం: కాటారం మండలంలోని అయ్యప్న స్వామి సాక్షిగా 2017 నూతన సంవత్సరానికి కులాంతర ప్రేమ వివాహం స్వాగతం పలికింది. మండలంలోని ఆనంద ధర్మశాస్త్ర అయ్యప్పస్వామి దేవాలయంలో టీఆర్‌ఎస్ యూత్ మండల అధ్యక్షుడు నాయిని శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆదివారం కులాంతర వివాహం జరిగింది. వివరాలలోకి వెళితే కాటారం మండల కేంద్రంలోని ఆర్యవైశ్య కులానికి చెందిన మద్ది కిష్టయ్య-జానకమ్మల చిన్న కుమారుడు మద్ది నాగరాజు(22), మల్హార్‌రావు మండలం తాడిచెర్ల గ్రామం కాపు కులానికి చెందిన పూసాల రవి-రమల రెండవ కూతురు దివ్య(18)లు గత రెండు సంవత్సరాలుగా ప్రేమించుకుటున్నారు.

కాగా, సంవత్సరం క్రితం వీరు ప్రేమ విషయం అబ్బాయి, అమ్మాయి తల్లిదండ్రులకు తెలిసింది. అప్పటికి మైనర్ కావడంతో అమ్మాయి తల్లిదండ్రులు వారి పెళ్లికి అభ్యంతరం తెలిపారు. దీంతో కొన్ని రోజులుగా అమ్మాయిని బయటికి రాకుండా జాగ్రత్త పడ్డారు. ఇటీవల అమ్మాయి 18 ఏళ్లు నిండి మేజర్ కావడంతో గత నెల 30వ తేదీన నాగరాజు, దివ్య ఇళ్ల నుండి వెళ్లిపోయారు. వారి వివాహానికి అమ్మాయి తల్లిదండ్రులు అడ్డుపడుతారని టీఆర్‌ఎస్ యూత్ అధ్యక్షుడు నాయిని శ్రీనివాస్‌ను అబ్బాయి తల్లిదండ్రులు సంప్రదించగా శనివారం స్థానిక అయ్యప్ప స్వామి దేవాలయంలో పురోహితులు మాడుగుల నాగరాజు శర్మ మంత్రోచ్ఛరణల మధ్య వీరి వివాహం జరిపించారు. పుట్ట లింగమ్మ చారిట బుల్ ట్రస్టు తరఫున రూ.5 వేల రూపాయలు అందజేసినట్లు వారు తెలిపారు. అనంతరం కాటారం పోలీస్ స్టేషన్‌లో ప్రేమ విహాహం చేసుకున్నట్లు తెలిపారు.

Comments

comments