Search
Sunday 18 November 2018
  • :
  • :
Latest News

సంక్షేమ భగీరథుడు కెసిఆర్

Welfare Bhagirathudu is kcr

ముస్లింలకు 12 కాదు, 15 శాతం రిజర్వేషన్లు సాధించే సత్తా ఆయనకే ఉంది
ప్రగతి నివేదనకు లక్ష మందిమి హాజరవుతాం
ఇమామ్, మౌజంల జీతాలను భారీగా పెంచిన ఘన చరిత్ర టిఆర్‌ఎస్ ప్రభుత్వానిదే
కాళేశ్వరంతో తెలంగాణ సస్యశ్యామలం
డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు, దళితులకు మరింత ఉచిత కరెంట్ వంటి సంక్షేమ చర్యలు అలరిస్తున్నాయి
వక్ఫ్‌బోర్డు చైర్మన్ ఎండి సలీమ్ 

మన తెలంగాణ/ హైదరాబాద్ : సంక్షేమ కార్యక్రమాల అపర భగీరథుడు సిఎం కె. చంద్రశేఖర్‌రావు అని వక్ఫ్‌బోర్డు చైర్మన్ ఎండి సలీమ్ అన్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల సంక్షేమానికి పాటుపడుతూ, తెలంగాణను ప్రగతి బాటలో నడిపిస్తున్నారని వ్యాఖ్యానించారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అన్ని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా మారుతున్నాయన్నారు. ఆయా రాష్ట్రాల్లో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను అమలు చేయాలని కోరుతూ అక్కడి ప్రజల నుంచి స్థానిక ప్రజా ప్రతినిధులకు పెద్ద ఎత్తున విజ్ఞప్తులు వస్తున్నాయన్నారు. మంగళవారం ‘మన తెలంగాణ’ ప్రతినిధితో సలీమ్ మాట్లాడారు. టిఆర్‌ఎస్ పాలనపై ప్రజలు పూర్తి సంతృప్తి, సంతోషంతో ఉన్నారన్నారు. ముఖ్యంగా ముస్లిం వర్గాలు అయితే కెసిఆర్ అంటే పెద్ద భరోసాగా భావిస్తున్నాయని చెప్పారు. ఆయ న వచ్చిన తరువాతనే ముస్లిం ప్రజల అభివృద్ధి పట్టాలు ఎక్కిందన్నారు. విద్యకు అధిక ప్రాధాన్యతను ఇచ్చారన్నారు.

అలాగే ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు సిఎం కెసిఆర్ సాధిస్తారన్న నమ్మకం తమకుందన్నారు. దీనిపై ఇటీవల ప్రధాని నరేంద్రమోడి కూడా కెసిఆర్ చర్చించారన్నారు. మళ్ళీ కెసిఆర్ అధికారంలోకి వస్తే ముస్లింల రిజర్వేషన్ల శాతం 15శాతం వరకు పెరుగుతుందన్న ధీమా వ్యక్తం చేశారు.పేదరికం కారణంగా ఐఎఎస్, ఐపిఎస్ కోర్సుల్లో చదువుకోలేని ముస్లింల కోసం సంవత్సరానికి వందమందికి ఉచితంగా చదువు చెప్పిస్తున్నారని, షాదీముబారక్ పేరుతో లక్ష నూటపదహారు రూపాయాలను కెసిఆర్ కానుకగా ఇస్తున్నారన్నారు. మసీదుల్లో విధులు నిర్వహించే ఇమామ్, మౌజన్‌లకు జీతాలను రూ.1500 నుంచి రూ.5 వేలకు పెంచిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. నీటి ప్రాజెక్టులకు, విద్యుత్ రంగంపై దృష్టి సారించడంతో రైతులకు పుష్కలంగా నీరు…24 గంటల కరెంటు సరఫరా అందుతోందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి అయితే తెలంగాణ రాష్ట్రం మరింత సస్యశ్యామలంగా మారుతుందన్నారు. పేదల కోసం ఉచితంగా నిర్మిస్తున్న ఉచిత డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ళు,వంద యూనిట్ల వరకు దళిత వర్గాలకు ఉచిత కరెంటు సరఫరా వంటి సంక్షేమ కార్యక్రమాలను చేపట్టడం కెసిఆర్‌కే చెల్లిందన్నారు.

సభకు లక్షమంది ముస్లింలు
ప్రగతి నివేదన సభకు సుమారు లక్షమంది ముస్లిం ప్రజలను తరలించనున్నామని సలీమ్ స్పష్టం చేశారు. ఈ మేరకు పార్టీకి చెందిన మైనార్టీ నేతలంతా శ్రమిస్తున్నారన్నారు. ఇప్పటి వరకు పాలన చేసిన అన్ని ప్రభుత్వాల కంటే టిఆర్‌ఎస్ పాలనలోనే ముస్లిం ప్రజలు హాయిగా ఉన్నారన్నారు. అనేక పథకాలు అందుతున్నాయన్నారు. ఈ నేపథ్యంలో కెసిఆర్‌కు మద్దతు తెలిపేందుకు పెద్దఎత్తున సభకు తరలిరానున్నారని తెలిపారు.

Comments

comments