Search
Tuesday 20 November 2018
  • :
  • :

అర్హులకు సంక్షేమ ఫలాలు

Welfare-fruits

పెద్దపల్లి కలెక్టర్ శ్రీదేవసేన

మనతెలంగాణ/పెద్దపల్లి: పేదవారి అభ్యున్నతి కోసం ప్ర భుత్వం అందిస్తున్న సంక్షేమ ఫలాలు అర్హులకు మాత్రమే అందజేయాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ శ్రీదేవసేన అధికారులను ఆదేశించారు.కలెక్టరేట్ సమావేశ మందిరంలో సో మవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి ఆర్జీలను స్వీకరించారు. వివిధ సమస్యలపై ప్రజలనుంచి వచ్చిన 80విజ్ఙప్తులను సంబంధిత శాఖలకు పంపి వెంటనే పరిష్కరించాలని ఆదేశాలు జారిచేశారు. రా ష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమం మరియూ అభివృద్ధి కొరకు ప్రారంభించిన పథకాలు పక్కదారి పడితే కఠిన చర్యలు తీ సకుంటానని ఈ సందర్భంగా అదికారులను హెచ్చరించా రు.పెద్దపల్లి మండలం హన్మంతుని పేటకు చెందిన నక్క రామమ్మ తన ఆర్థిక పరిస్థితి బాగా లేనందున తనకు డ బుల్ బెడ్ రూం ఇళ్లు మంజూరు చేయాలని కోరగా హౌ సింగ్ డిఎంకు రాస్తూ పరిశీంచి తగిన న్యాయం చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ డ బుల్ బెడ్‌రూం ఇండ్ల లబ్ధిదారులను గ్రామ సభలో అర్హత మేరకు నిర్ణయించాలని, ఖచ్చితమైన మార్గనిర్దేశకాలు పా టించి ఎంపిక చేయాలని అన్నారు.
డబుల్ బెడ్ రూం ఇండ్ల కోసం ప్రజావాణిలో దరఖాస్తు చే సుకోవలసిన అవసరం లేదని, నేరుగా గ్రామంలో దరఖా స్తు చేసుకోవాలని సూచించారు.ప్రజావాణిలో వృద్ధ్దాప్య పింఛన్లు,భూ సమస్యలు ఇ ంకా రావడం కలెక్టర్ ఆశ్యర్యం వ్యక్తం చేశారు.ప్రభుత్వం ఇప్పటి వరకు పలు దఫాల్లో ఆ యా గ్రామాల్లో ఈ సంక్షేమ పథకాలకు దరఖాస్తులు తీసుకోని పరిష్కరించామని అన్నారు.ప్రజావాణిలో ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్న శాఖలు క్షేత్ర స్థాయిలో పర్యటించి అ ర్హులందరికీ పథకాలను వర్తింప జేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ వనజా దేవి, డిఆర్‌ఒ పద్మయ్య,జిల్లా వైద్యాధికారి ప్రమోద్‌కుమార్, ఆర్‌డబ్లూస్ ఇఇ తిరుపతిరావు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Comments

comments