Home నాగర్ కర్నూల్ సంక్షేమ పథకాలే శ్రీరామ రక్ష

సంక్షేమ పథకాలే శ్రీరామ రక్ష

Welfare schemes are sri rama raksha
స్థానిక ఎన్నికలలో ప్రతిపక్ష పార్టీలకు అభ్యర్థులు
కరువవుతారు
28న మద్దిమడుగులో స్థానిక ఎన్నికల శంఖారావం
అచ్చంపేట ఎంఎల్‌ఎ గువ్వల బాల్‌రాజ్

మనతెలంగాణ/అచ్చంపేట: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజలు, రైతుల సంక్షేమానికి ప్రవేశ పెట్టిన పథకాలే రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో
టీఆర్‌ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల విజయానికి దోహద పడుతాయని అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాల్‌రాజ్ అన్నారు. శుక్రవారం అచ్చంపేట క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గడువులోపే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను చేస్తుందని, ఎన్నికలు ఎప్పుడు వచ్చిన ఎదుర్కునేందుకు కార్యకర్తలు సిద్దంగా ఉండాలని పిలుపునిచ్చారు. గతంలో అచ్చంపేట నగర పంచాయతీ ఎన్నికలలో వెలువడిన ఫలితాలు మరోసారి పునరావృతం కానున్నాయని, అచ్చంపేట నియోజక వర్గంలో ఎక్కువ స్థానాలు గెలిచి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు భహుమతిగా అందజేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. రైతుల సంక్షేమం కోసం పంటల పెట్టుబడులకు పార్టీలకతీతంగా ప్రతి రైతుకు రైతు బందు పథకం ద్వారా ఎకరాకు నాలుగు వేలు అందించి రైతుల గుండెల్లో రాష్ట్ర ముక్యమంత్రి చిరస్థాయిగా నిలిచాడని, స్థానిక ఎన్నికల ద్వారా ముఖ్యమంత్రికి కృతఙతలు తెలిపేందుకు రైతులు ఎదురు చూస్తున్నారన్నారు. ఇదే స్పూర్తితో సీఎం రైతు భీమా పథకాన్ని ప్రవేశ పెట్టారన్నారు. నియోజక వర్గంలోని రైతులకు సబ్సీడీపై 140 ట్రాక్టర్లు వచ్చాయని ఈనెల 28న ఉదయం 8గంటలకు అచ్చంపేట పట్టణంలోని ఎన్‌టీఆర్ స్టేడియంలో లబ్దిదారులకు పంపిణీ చేయనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. నల్లమలలో పవిత్ర పున్యక్షేత్రమైన మద్దిమడుగు ఆంజనేయ స్వామి సన్నిదినుండి ఈనెల 28న స్థానిక ఎన్నికల శంఖారావం పూరించనున్నట్లు తెలిపారు. నియోజక వర్గంలోని ఎనిమిది మండలాకు చెందిన గ్రామ స్థాయి పార్టీ కార్యకర్తనుండి మద్ది మడుగులో జరిగే సమావేశనికి తరలి రావాలని పిలుపునిచ్చారు. రానున్న స్థానిక ఎన్నికలలో ప్రతిపక్ష పార్టీలకు వార్డునెంబర్‌గా పోటీ చేసేందుకు సైతం అభ్యర్థులు దొరికే పరిస్థితులు లేవన్నారు. స్థానిక ఎన్నికల ఫలితాలు ఇతర పార్టీలకు ఒక గుణ పాటంగా నిలుస్తాయన్నారు. ఈవిలేకరుల సమావేశంలో రైతు సమన్వయ సమితీ జిల్లా కోఆర్డినేటర్ మనో హర్, మున్సిపల్ ఛైర్మెన్ తులసీరాం, ఎంపీపీ పర్వతాలు, జెడ్‌పీటీసీ రామకృష్ణారెడ్డి, నేతలు గోపాల్‌రెడ్డి, బాలయ్య,రాజేశ్వర్‌రెడ్డి, చంద్రమౌళి, రాంబాబు నాయక్, వెంకట్‌రెడ్డి, గణేష్, నర్సింహ్మరెడ్డి, చెన్న కేశవులు, కేటీ తిరుపతయ్య, రాజారాం గౌడ్, కొండల్‌రావు,నీరంజన్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.