Search
Saturday 17 November 2018
  • :
  • :
Latest News

వికలాంగుల కోసం సంక్షేమ పథకాలు

phisicalతెలంగాణ/ఆసిఫాబాద్ : ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను వికలాంగులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ చంపాలాల్ తెలిపారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఐసిడిఎస్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రపంచ వికలాంగుల దినోత్సవానికి ఎంఎల్‌ఎ కోవలక్ష్మితో కలిసి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. అంగవైకల్యమనేది ఎవరి తప్పు కాదని, వికలాంగులను మనతో సమానంగా చూడడం మన బాధ్యత అన్నారు. ప్రభుత్వ జీవోల ప్రకారం వారికి సహాయం చేసి అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వికలాంగుల కోసం అనేక సంక్షేమ పథకాలు, ఉపాధి అవకాశాలు, రాయితీ రుణాల సౌకర్యాలు కల్పిస్తుందని వీటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. అదే విధంగా వికలాంగుల సమస్యలను జాయింట్ కలెక్టర్‌తో చర్చించి రాబోయే ప్రజా ఫిర్యాదుల విభాగంలో నివేదికలు సమర్పించాలని ఐసిడిఎస్ పిడి సావిత్రిని ఆదేశించారు. జిల్లాలో 1400 డబుల్ బెడ్‌రూం ఇండ్లు మంజూరయ్యాయని, అందులో వికలాంగులకు అవకాశం కల్పిస్తామన్నారు. అనంతరం ఎంఎల్‌ఎ కోవలక్ష్మి మాట్లాడుతూ వికలాంగులకు ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని వాటిని అర్హులైన ప్రతీ ఒక్కరికి అధికారులు అందేలా చూడాలన్నారు. జిల్లా కేంద్రంలో వికలాంగుల కమిటీ భవన నిర్మాణానికి కృషి చేస్తానన్నారు. అనంతరం వికలాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఆటల పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో మహిళ శిశుసంక్షేమ శాఖ ఆర్గనైజర్ సరోజన, మార్కెట్ కమిటీ చైర్మన్‌శ్రీనివాస్, ఐటిడిఎస్ పిడి సావిత్రి, వికలాంగుల సంఘ నాయకులు పాల్గొన్నారు.

Comments

comments