Home జాతీయ వార్తలు మోదీజీ..నిప్పుతో చెలగాటం వద్దు: మమతా బెనర్జీ

మోదీజీ..నిప్పుతో చెలగాటం వద్దు: మమతా బెనర్జీ

West Bengal CM Mamata Banerjee Fires On PM Modi

కోల్‌కతా : ప్రధాని మోదీ మిడ్నపూర్ కిసాన్ ర్యాలీలో  పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సర్కార్ పై చేసిన విమర్శలపై తృణమూల్‌ కాంగ్రెస్‌  ఘాటుగా స్పందించింది. నిప్పుతో చెలగాటం వద్దని మోదీకి హితవు పలికింది. ఈ ర్యాలీకి పొరుగు రాష్ట్రాలు జార్ఖండ్,ఒడిషాల నుంచి పెద్ద ఎత్తున తనలించారని విమర్శించింది. కిసాన్‌ ర్యాలీలో ప్రధాని మాట్లాడుతూ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాష్ట్రంలో సిండికేట్‌ రాజకీయాలను నడిపిస్తూ అధికారంలో కొనసాగేందుకు స్వార్ధపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించిన విషయం తెలిసిందే. మత ఛాందసవాదం, అవినీతి, హత్యా రాజకీయాలతో బిజెపి సిండికేట్‌గా మారిందని ఆగ్రహం వ్యక్తం చేసింది.